Bhagavad-Gita

 

                                       CONTENTS

1.  అధ్యాయము:  అర్జున విషాద యోగము (అర్జునుని సందిగ్ధత)  5

సైన్యాధ్యక్షుల పరిచయం   118. 6

అర్జునుడు సైన్యాన్ని పరిశీలించాలనుకున్నాడు... 6

అర్జునుని సందిగ్ధత.. 7

అర్జునుడు యుద్ధం వలన వచ్చే చెడులను వివరించాడు... 8

రాజభోగాల కోసం బంధుమిత్రులను చంపడం ఘోరమైన పాపమేమో! 8

2.  వ అధ్యాయము: సాంఖ్య యోగము (పారమార్థిక జ్ఞానం)  9

అర్జునుడు యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు    9

గీతా బోధనలు  ప్రారంభం.... 10

ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది... 11

శ్రీకృష్ణుడు అర్జునుడికి, యోధునిగా తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు    12

కర్మయోగం  ప్రాముఖ్యత, నిస్వార్ధ సేవ.. 13

వేదాలు జీవితంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలతో వ్యవహరిస్తాయి      14

కర్మయోగం యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ.. 15

జ్ఞానిని గుర్తించడానికి గుర్తులు... 16

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదాలు... 16

ఇంద్రియ నియంత్రణ మరియు స్వీయ జ్ఞానం ద్వారా శాంతి మరియు ఆనందాన్ని పొందడం     17

3.  వ అధ్యాయము:  కర్మయోగము.... 18

ప్రతీ ఒకరు ఇతరులకు ఎందుకు సేవ చేయాలి?. 19

నాయకులు మార్గదర్శకులు కావాలి... 21

అన్ని కర్మలు ప్రకృతి నిర్దేశించినవే.... 22

పరిపూర్ణత  మార్గంలో రెండు ప్రధాన అవరోధాలు... 23

కామం (కోరిక) పాపానికి మూలం.... 23

కోరికలను ఎలా నియంత్రించాలి?. 24

4.  వ అధ్యాయము:  జ్ఞాన యోగము.... 24

కర్మ యోగం ఒక పురాతనమైన సిద్ధాంతం.... 24

భగవంతుని అవతారం యొక్క ఉద్దేశ్యం...... 24

ఆరాధన, ప్రార్థన చేసే విధానం.... 25

విహిత, వికర్మ మరియు అకర్మ కర్మలు... 26

కర్మయోగి కర్మబంధనాలకు లోబడి ఉండడు... 26

వివిధ రకాల ఆధ్యాత్మిక పద్ధతులు... 27

అతీంద్రియ జ్ఞానాన్ని పొందడం ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన   28

నిర్వాణానికి అతీంద్రియ జ్ఞానం మరియు కర్మయోగం రెండూ అవసరం     29

5.  వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము.... 29

కర్మయోగి భగవంతుని కోసమే కర్మలు చేస్తాడు... 30

ఆధ్యాత్మి జ్ఞానము యొక్క మార్గం.... 31

మూడవ మార్గం --- భక్తి ధ్యానం మరియు ధ్యానం యొక్క మార్గం     33

6.  వ అధ్యాయము: ధ్యాన యోగము.... 33

కర్మ యోగి కూడా పరిత్యాగి.. 33

యోగం మరియు యోగి నిర్వచనం.... 33

మనస్సే ఒక స్నేహితుడు మరియు శత్రువు... 34

ధ్యానము- పద్ధతులు... 34

యోగి అంటే ఎవరు?. 36

మనస్సును నిగ్రహించడానికి రెండు పద్ధతులు... 37

యోగ లక్ష్యము సాధించని యోగి పరిస్థితి... 37

ఎవరు ఉత్తమమైన యోగి?. 38

7.    అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము.... 39

పదార్థం, స్పృహ మరియు ఆత్మ గురించి నిర్వచనాలు... 39

సర్వోన్నత ఆత్మ అన్నింటికీ ఆధారం.... 39

భగవంతుని శరణు కోరేదెవరు?. 40

8.  వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము.... 42

పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతం.... 42

భగవంతుని-సాక్షాత్కారానికి సులువు మార్గము.... 43

మరణ సమయంలో భగవంతుడిని ధ్యానించడం ద్వారా మోక్షాన్ని పొందండి    43

నిష్క్రమణ (మరణించడం) యొక్క రెండు ప్రాథమిక మార్గాలు    45

9.  వ అధ్యాయము: రాజవిద్యా రాజగుహ్య యోగము.... 45

జ్ఞానుల మరియు అజ్ఞానుల మార్గాలు... 47

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది... 47

భక్తి పూర్వక ప్రేమ ద్వారా మోక్షాన్ని పొందడం.... 48

ప్రేమ, భక్తితో భగవంతుని ఏది సమర్పించినా స్వీకరిస్తాడు    49

క్షమించరాని పాపి  ఎవరూ ఉండరు... 49

భక్తి ప్రేమ మార్గం సులభం.... 49

10.   వ అధ్యాయము: విభూతి యోగము.... 50

సమస్త సృష్టికి మూలాధారం భగవంతుడే.... 50

భగవంతుడు ఆయన భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 51

యదార్థ స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు... 51

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది... 52

దైవ ఆవిర్భావములను గురించి క్లుప్త వివరణ.. 52

అనంతమైన సృష్టిలో తెలుసున్నది చిన్న భాగమే..... 54

11.  వ అధ్యాయము: విశ్వరూప సందర్శన యోగము. 54

అన్వేషకుడి అంతిమ లక్ష్యం భగవంతుని దర్శనం.... 54

శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వ రూపాన్ని చూపిస్తాడు... 55

భగవంతుడిని చూడటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు లేదా అర్హత పొందలేకపోవచ్చు    55

అర్జునుడు విశ్వ రూపం చూసి భయపడ్డాడు... 57

మేము ఒక దైవిక పరికరం మాత్రమే..... 58

విశ్వ రూపానికి అర్జునుడి ప్రార్థనలు... 58

భగవంతుడిని ఏ రూపంలోనైనా చూడవచ్చు... 60

భక్తి ప్రేమ ద్వారా భగవంతుడిని చూడవచ్చు... 60

12.  వ అధ్యాయయు: భక్తి యోగము.... 61

సాకార రూపము లేదా నిరాకార బ్రహ్మాన్ని దేనిని ఆరాధించాలి?  61

భగవంతుని సాకార (వ్యక్తిగత) రూపాన్ని ఆరాధించడానికి కారణాలు    61

భగవంతుని చేరేందుకు నాలుగు మార్గాలు... 62

కర్మయోగము చాలా ఉత్తమమైనది... 62

భక్తుడి లక్షణాలు... 62

దైవిక లక్షణాలను పెంపొందించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలి    63

13.  వ అధ్యయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము     64

సృష్టి సిద్ధాంతం.... 64

మోక్ష  సాధనంగా నాలుగు విధాల దివ్యమైన సత్యం...... 65

భగవంతుడిని నీతికథల ద్వారా వర్ణించవచ్చు తప్ప వేరే విధంగా కాదు    65

పరమాత్మ, ఆత్మ, భౌతిక స్వభావం మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క వివరణ   66

విశ్వాసం మాత్రమే నిర్వాణానికి దారితీస్తుంది... 67

ఆత్మ లక్షణాలు... 68

14.  వ అధ్యయము: గుణ త్రయ విభాగ యోగము.... 68

అన్ని జీవులు ఆత్మ మరియు ప్రకృతి యొక్క సంయోగం నుండి జన్మిస్తాయి      68

భౌతిక స్వభావం యొక్క త్రిగుణములు ఆత్మను శరీరానికి ఎలా బంధిస్తాయి      69

ప్రకృతి యొక్క త్రిగుణాల లక్షణాలు... 69

వ్యక్తి ఆత్మల  పరకాయ ప్రవేశం కోసం త్రిగుణాలు వాహకాలుగా ఉంటాయి      70

భౌతిక స్వభావం త్రిగుణాలను  దాటిన తర్వాత నిర్వాణాన్ని పొందండి    70

త్రిగుణాలకు అతీతంగా ఉండే విధానం.... 70

నిష్కల్మష భక్తి ద్వారా త్రిగుణాలకు అతీతులవగలరు... 71

15.  వ అధ్యాయము: పురుషోత్తమ యోగము.... 71

సృష్టి అనేది మాయ శక్తులచే సృష్టించబడిన చెట్టు లాంటిది    71

జీవాత్మ ఆనందం.... 72

సర్వస్వం యొక్క సారాంశం ఆత్మే..... 73

పరమాత్మ, ఆత్మ మరియు సృష్టించిన జీవులు ఏమిటి?. 73

16.  వ అధ్యాయము: దైవాసుర సంపద్విభాగ యోగము.... 74

మోక్షసాధన కోసం దైవీ సంపద కలవాని లక్షణాలు... 74

వదిలివేయవలసిన దెయ్యాల లక్షణాల జాబితా.... 74

మానవులలో రెండు రకాలు మాత్రమే ఉన్నారు: జ్ఞానులు మరియు అజ్ఞానులు    74

బాధ అనేది అజ్ఞానుల విధి... 76

శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోవాలి... 76

17.  వ అధ్యయము: శ్రద్ధా త్రయ విభాగ యోగము.... 77

మూడు  రకాల విశ్వాసాలు... 77

మూడు రకాల ఆహారాలు... 77

మూడు రకాల త్యాగాలు... 78

వాక్కు సంబంధమైన తపస్సు... 78

మూడు రకాల తపస్సులు... 79

మూడు రకాల దానాలు... 79

పరబ్రహ్మమునకు సూచిక పదాలు... 79

18.  వ అధ్యాయము: . మోక్ష సన్యాస యోగము.... 80

సన్యసించడం మరియు త్యజించడం నిర్వచనం.... 80

మూడు రకాలైన త్యాగాలు... 81

కర్మ యొక్క ఐదు కారకాలు... 81

మూడు రకాల జ్ఞానాలు... 82

మూడు రకాల కర్మలు... 82

మూడు రకాల కర్తలు... 83

మూడు రకాల బుద్ధులు... 83

మూడు రకాల సంకల్పాలు మరియు మానవ జీవితంలోని నాలుగు లక్ష్యాలు    83

మూడు రకాల ఆనందాలు... 84

విధి, క్రమశిక్షణ మరియు భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం     85

కర్మ బంధం మరియు స్వేచ్ఛా సంకల్పం.... 86

లొంగిపోయే మార్గమే  భగవంతుని చేరడానికి అంతిమ మార్గం     87

భగవంతునికి అత్యున్నత సేవ, మరియు ఉత్తమ దాతృత్వం     88

గీతా ప్రాముఖ్యత.. 88

జ్ఞానం మరియు కర్మ రెండూ అవసరం.... 89

 

BHAGAVAD-GITA VERSES

(తెలుగులో భగవద్గీత శ్లోకం)

(English Translation by IGS)

www.gita-society.com

 

1.  అధ్యాయము:  అర్జున విషాద యోగము (అర్జునుని సందిగ్ధత)

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా, నావారైన దుర్యోధనాదులు, పాండుకుమారులైన ధర్మరాజాదులు యుద్ధము చేయు కుతూహలముతో పుణ్యభూమి ఐన కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి? (1.01) సంజయుడు చెప్పెను: రాజైన దుర్యోధనుడు వ్యూహాకారములో నిలిచి ఉన్న పాండవసేనను చూచి, గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను: (1.02) ఓ గురువర్యా! బుద్ధిశాలియు మీ శిష్యుడు అయిన ధష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యాన్ని చూడుము! ఈ పాండవసేన యందు గొప్ప విలుకాండ్రును, శూరవీరులును, పరాక్రమవంతులును, మహారధులును ఉన్నారు. మీ కోసం వారిలో కొందరి పేర్లు చెప్పెదను.(1.03-06) ఇక మన సైన్యములో ప్రముఖులు సేనానాయకులు ఎవరు కలరో వారి గురించి మీకు చెప్పుచున్నాను.

సైన్యాధ్యక్షుల పరిచయం   118

నా కోసం తమ తమ జీవితాలను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీకు తెలియడం కోసం ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. (1.07-09) మన సైన్యము అపరిమితంగా ఉంది, కానీ పాండవుల సైన్యము పరిమితముగా ఉండటంతో జయించడానికి ఎక్కువ అవకాశముగా ఉన్నది. కావున, కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. (1.10-11) పరాక్రమశాలి, కురువృద్ధుడూ అయిన భీష్మ పితామహుడంతట దుర్యోధనునికి ఉత్సాహము కలుగునట్లు పెద్దగా సింహధ్వని చేసి శంఖమును పూరించెను (ఊదెను).(1.12) దాని తర్వాత, సైన్యమందున్న మిగిలిన వారు కూడా శంఖములను, భేరులను, తప్పెటలు మున్నగువానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముతో దిక్కులు పిక్కటిల్లెను. (1.13)  అపుడు తెల్లని గుర్రములతో కూడిన గొప్ప రథమునందు కూర్చున్న కృష్ణార్జునులిద్దరూ తమ తమ దివ్యమైన శంఖములను గట్టిగా ఊదిరి. (1.14) శ్రీ కృష్ణుడు తన శంఖమును ఊదెను; అపుడు అర్జునుడు మరియు మిగిలిన సేనాని వారికి సంబంధించిన శంఖములను ఊదిరి. పాండవ వీరుల శంఖముల యొక్క ధ్వని భూమ్యాకాశాలను దద్ధరిల్లుచేయుచూ కౌరవాదుల గుండెలను బ్రద్దలు చేసెను. (1.15-19)

అర్జునుడు సైన్యాన్ని పరిశీలించాలనుకున్నాడు

రణరంగమున ఆయుధములు ప్రయోగించడానికి సిద్దముగా  యుద్ద సన్నద్ధులై ఉన్న కౌరవులను చూసి, కపిధ్వజుడగు అర్జునుడు ధనుస్సును చేత పూని, శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికెను: ఓ కృష్ణా! ఈ యుద్దం మొదలు పెట్టేముందు నేనెవరితో యుద్దము చేయవలెనో, అట్టి ఈ యుద్ధాభిలాషులను నేను ఎక్కడి నుండి బాగా చూడగలనో అక్కడ రెండు సేనల మధ్య నా రథమును నిలుపుము. (1.20-22) దుష్టబుద్ధిగల దుర్యోధనునికి యుద్ధమున సంతోషమును కలిగించవలెననే కోరిక కలిగి, ఇక్కడకు చేరిన ఈ యోధులను నేను చూడాలనుకుంటున్నాను. (1.23) సంజయుడు చెప్పెను: ఓ రాజా! అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఉత్తమమైన ఆ రథమును రెండు సేనల మధ్య భీష్ముడు, ద్రోణుడు, ఇంకా మిగిలిన రాజులందరి ఎదుట నిలిపి, అర్జునుడితో, ఇక్కడ చేరిన ఈ  కౌరవులను చూడమని చెప్పెను. (1.24-25) అక్కడ, అర్జునుడు రెండు సేనలయందూ నిలబడి ఉన్న తండ్రులను, తాతలను,, గురువులను, మనుమలను, స్నేహితులను, మామలను, హితైభిలాషులను (అందరినీ) చూసెను. (1.26)

అర్జునుని సందిగ్ధత

రెండు సైన్యాల వరుసలలో నిలబడి ఉన్న తండ్రులు, సహచరులు మరియు అతని బంధువులందరినీ చూసి అర్జునుడు కరుణార్ధహృదయుడై దు:ఖంతో ఇలా అన్నాడు: ఓ కృష్ణా! యుద్దము చేయడానికి ఇక్కడ సమకూడిన ఈ బంధుజానాన్ని చూచి నా అవయవములు పట్టు తప్పుతున్నవి; నోరెండుపోతున్నది, శరీరమందు వణుకు పుట్టుచున్నది; రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి; (1.27-29) గాండీవము చేతినుండి జారిపోతున్నది; చర్మము మండుతున్నది; నిలబడుటకు కూడా నాకు శక్తి సరిపోవడంలేదు; తల గిర్రున తిరుగుచున్నది.  ఓ కృష్ణా! అపశకునములను కూడా చూస్తున్నాను. యుద్దములో బంధువులను చంపి తర్వాత పొందబోయే లాభమేమిటో నాకు కనిపించడం లేదు. (1.30-31) నేను విజయమును కానీ, రాజ్యమును కానీ, సుఖములను కానీకోరను, ఓ కృష్ణా! ఎవరి కోసం  రాజ్యము లేదా భోగము లేదా చివరికి జీవితం? ఎవరి కోసమయితే రాజ్యమును, సుఖములను, భోగములను కోరుకుంటున్నామో, అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, సంబంధితులందరూ తమ ప్రాణాల మీద, ధనము మీద ఆశ వదులుకుని ఈ రణరంగమునందు వచ్చి నిలబడి ఉన్నారు.  (1.32-33) నన్ను చంపుదామనుకున్న వారైనప్పటికీ, వీరిని ముల్లోకముల రాజ్యాధిపత్యము కోసం కూడా నేను వారిని చంపడానికి ఇష్టపడను, అలాంటిది, భూలోక రాజ్యము కోసం ఏ విధంగా చేయగలను కృష్ణా? (1.34-35)

ఓ కృష్ణా! దుర్యోధనాదులను చంపడం వలన మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. (1.36) ఓ కృష్ణా! కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు, నాకు కావల్సిన వాళ్లు, నా దగ్గర బంధువులు. వీళ్లను చంపడం న్యాయమా చెప్పు.(1.37) ఓ కృష్ణా! ఈ దుర్యోధనుడు, దుశ్శాశనుడు పరమ లోభులు, వారికి రాజ్యకాంక్ష, పదవీ కాంక్ష, రాజ్య సుఖాలు తప్ప మరొకటి తెలియదు. వీరు బంధువులకే కాదు తమ మిత్రులకు కూడా ద్రోహం చేస్తారు. మనకు అన్నీ తెలుసు కదా!(1.38-39)

 

అర్జునుడు యుద్ధం వలన వచ్చే చెడులను వివరించాడు

కులము నాశనమయితే అనాదిగా వస్తున్న కుల ధర్మములు అంతరించిపోతాయి. ధర్మము నశించి పోవుటచే కులమంతటా అధర్మము వ్యాపించును. (1.40) అధర్మము వృద్ధి చెందుటచే కులస్త్రీలు చెడిపోవుదురు. ఎప్పుడయితే స్త్రీలు చెడిపోవుదురో అప్పుడు వర్ణసంకరం ఏర్పడును. ఎవరికి పుట్టారో, ఎవరు ఏ వర్ణమో, ఏ కులమో తెలియకుండా పోతుంది.  (1.41) వర్ణ సంకరం జరిగితే ఈ యుద్ధంలో మరణించిన వారికి అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు, జలతర్పణములు లేనివారై అథోగతి పాలవుతారు.  (1.42) జాతి ధర్మాలు అన్నీ శాశ్వతంగా నాశనం కావడానికీ ఈ యుద్ధమే కారణము. అందులో సందేహము లేదు. (1.43) కులధర్మాలు, వర్ణ సంకరాలు, జాతి ధర్మాలు నాశనం కావడానికి కారణం అయిన ఈ యుద్ధం చేసిన వారికి కూడా శాశ్వత నరకలోకం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. (1.44)

రాజభోగాల కోసం బంధుమిత్రులను చంపడం ఘోరమైన పాపమేమో!

అయ్యో! రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం బంధువులను, మిత్రులనుచంపి, ఘోరమైన పాపం చేయడానికి మనం సన్నద్ధం అయ్మాము. (1.45) ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా, దీనికంటే మేలే. (1.46) సంజయుడు చెప్పెను: ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో శత్రువుల మీద దయతో, జాలితో, కరుణ నిండినవాడై, తన గాంఢీవమును, అస్త్ర, శస్త్రములను కింద పెట్టి, రథం వెనుక ఏమీ చేతకాని వాడివలె చతికిలబడెను.  (1.47)

2.  వ అధ్యాయము: సాంఖ్య యోగము (పారమార్థిక జ్ఞానం)

సంజయుడు పలికెను: కళ్లనిండా నీళ్లు తిరుగుతూ, అర్జునుని మనసు బాధతో నిండిపోయి ఉంది. విషాదంలో మునిగిపోయిన అర్జునితో శ్రీ కృష్ణుడు ఇలా పలికాడు.  (2.01) శ్రీ భగవానుడు చెప్పెను: ఓ అర్జునా! ఈ సమయంలో నీకు ఈ శోకము, మోహము, దు:ఖము, మనోదౌర్భల్యము ఎలా దాపురించాయి? నీలాంటి వీరులు, పరాక్రమవంతులు ఇలా చేస్తారా, అదీ ఈ సమయంలో!  యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా?  (2.02) ఓ అర్జునా! ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది? నా మాట విని నీ హృదయ దౌర్భల్యాన్ని వదిలిపెట్టు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. లే! ధనుర్భాణాలు తీసుకో! యుద్ధానికి సన్నద్ధం కా!  (2.03)

అర్జునుడు యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతాడు

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! భీష్ముడు, ద్రోణుడు పూజింపదగినవారు. అట్టివారి మీద బాణములను సంధించి నేను ఎలా యుద్ధం చేయగలను? (2.04)  మహానుభావులైన ఇటువంటి గురువులను చంపే కంటే ఈ లోకమునందు భిక్షాన్నము భుజించుట మంచిది. వారిని చంపినచో వారి రక్తముతో తడిసి ధన భోగాలనే అనుభవించవలసి వస్తుంది. (2.05)  అంతేకాకుంతడా ఈ యుద్ధమున మనము గెలుస్తమో లేక వారు గెలుస్తారో కూడా చెప్పలేము.  ఈ రెండింటింలో ఏది మంచిదో కూడా తెలియదు. ఇచట మన ఆత్మీయులే మనను ఎదిరింప మన ఎదురుగా యుద్ధమున నిలిబడి ఉన్నారు. (2.06)

ఓ కృష్ణా! ప్రస్థుతము నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది. అంతా అయోమయంగా ఉంది. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. నన్ను నీ శిష్యుడిగా భావించి ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిర్ణయించుకుని తరువాత ఆ మార్గాన్ని నాకు చూపించు. నేను నీ మాట జవదాటను; శరణు కోరు నన్ను ఈ ప్రకారముగా నడుచుకొనుము’ – అని శాసింపుము. (2.07) నాలో కలిగిన ఈ దు:ఖము, నా ఇంద్రియాలను దహించి వేస్తోంది. సిరిసంపదలతో కూడిన శత్రువులు లేని రాజ్యము లభించిను చివరకు  ఇంద్రపదవి, స్వర్గసుఖాలు, ఏమి లభించినా  శోకాగ్ని చల్లారేట్లు కనిపించడం లేదు. (2.08) సంజయుడు చెప్పెను: ఓ రాజా! ఈ విధంగా అర్జునుడు శ్రీ కృష్ణునితో చెప్పి నేను ఇక యుద్ధము చేయననిపలికి మౌనము వహించెను. (2.09) ఓ రాజా, రెండు సేనల మధ్య బాధపడుతూ ఉన్న అర్జునుని చూసి, శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాడివలె ఈ విధముగా పలికెను.  (2.10)

గీతా బోధనలు  ప్రారంభం

శ్రీకృష్ణ భగవానుడు చెప్పెను: ఓ అర్జునా! ఎవరి కోసం అయితే శోకించడం తగదో వారి గురించి నీవు శోకిస్తున్నావు; పైగా అన్నీ తెలిసిన పండితుని వలె నీవు మాట్లాడుతున్నావు. నిజంగా పండితులు, జ్ఞానులు, జీవించి ఉన్న వారి గురించి గానీ, ఇంతకు ముందే మరణించిన వారి గురించి గానీ ఎన్నడూ శోకించరు. (2.11) నేను కానీ, నువ్వు కానీ, ఈ రాజులు కానీ, ఇప్పటి వరకూ లేకుండా ఉండని కాలము లేదు. భవిష్యత్తులో ఉండబోరు అనే మాట కూడా లేదు. (2.12) కేవలం  జీవునకీ శరీరమునందు (ఆత్మ,జీవాత్మ)  బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం ఇలా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. మరణం తర్వాత  ఈ దేహం పోతే మరొక దేహం వస్తుంది. కాబట్టి ఈ విషయాలలో జ్ఞాని అయినవాడు ఎంతమాత్రమూ శోకము చెందడు.  (15.08 లో కూడా చూడండి) (2.13)  ఓ అర్జునా! ఇంద్రియముల యొక్క శబ్దస్పర్శాది విషయ సంయోగములు ఒకసారి చల్లదనాన్ని, ఒకసారి వేడిని, ఒకసారి సుఖమును, మరొకసారి దు:ఖమును కలుగజేస్తుంటాయి. అవి వస్తూ పోతూ అస్థిరంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఓర్చుకో. (2.14) ఓ అర్జునా! ఏ వ్యక్తినయితే బయట ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు, వాటి వలన కలిగే సుఖ దు:ఖములు ఎటువంటి బాధను కలిగించవో, ఎవరైతే సుఖదు:ఖములందు సమభావం కలిగి ఉంటాడో, అటువంటి వ్యక్తే మోక్షమునకు అర్హుడగును. (2.15)

ఆత్మ శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైనది

అనిత్యమైనదానికి అంటే లేని దానికి ఉనికి లేదు. సత్యమైన దానికి అంటే ఉన్నదానికి, లేకుండా పోవడం అంటూ ఉండదు. సత్, అసత్ ఈ రెండింటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలం తత్వము గురించి జ్ఞానము కలవాడికే ఈ రెండింటి యొక్క స్వరూప, స్వభావాలు తెలుస్తాయి. (2.16) ఓ అర్జునా! ఈ సమస్త ప్రపంచమూ ఏ పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నదో, అది నాశనము లేకుండా ఉన్నదని తెలుసుకో. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశనాన్ని ఎవడూ కలుగచేయలేదు. (2.17) ఓ అర్జునా! ఈ శరీరాలు అన్నీ నశించి పోయేవే. కాని ఆత్మ మాత్రము నాశనము కాదు. ఎందుకంటే ఆత్మ అవినాశి, అప్రమేయము, నిత్యము.  ఈ విషయం తెలుసుకుని నువ్వు యుద్ధం చెయ్యి. (2.18) ఈ ఆత్మ ఇతరులను చంపుతుంది అని అనుకునేవాడు, ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు, ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరి చేతిలోనూ చావదు. (2.19)  ఆత్మ ఎన్నడూ పుట్టలేదు. పుట్టలేదు కాబట్టి చావులేదు. పుట్టుక లేదు కాబట్టి ఉండటం, ఉండకపోవడం అంటూ కూడా లేదు. అంటే ఆత్మకు పుట్టుక, ఉండటం, పెరుగుదల, మార్పు, తరుగుదల, చావు అనేటటువంటి ఆ ఆరు వికారములు ఏవీ లేదు. ఈ శరీరం మరణించినా ఆత్మ మరణించదు. (2.20) ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు, ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరిని చంపరు, చంపించరు. (2.21)

మరణం మరియు ఆత్మ యొక్క పరకాయ ప్రవేశం

ఓ అర్జునా! ఎలా అయితే మానవుడు చిరిగిన వస్త్రాన్ని విడిచి, కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో, అలాగే ఈ శరీరములో ఉండే ఆత్మ కృశించిపోయిన పాత శరీరాన్ని విడిచిపెట్టి, కొత్త దేహాన్ని ధరిస్తుంది. (2.22)  ఈ ఆత్మను ఎటువంటి అస్త్ర, శస్త్రములు ఛేదించలేవు. అగ్ని దహించలేదు, నీరు తడపలేదు.అలాగే గాలి వీచినప్పుడు ఎగిరి పోదు. గాలికి ఎండకు ఎండిపోదు. ఎటువంటి పరిస్థితులలో కూడా నిశ్చలంగా ఏమీ అంటనట్లు ఉంటుంది. (2.23-24) ఈ ఆత్మ ఎవరికీ కనపడదు. వినపడదు. వికారములు పొందింపదగనిదిగా ఉందని చెప్పబడుచున్నది. కావున   ఈ విషయాన్ని తెలుసుకుని నీవు శోకించడం తగదు.  (2.25) ఓ అర్జునా! ఒకవేళ ఈ ఆత్మ నిరంతరము పుట్టుచూ చచ్చుచూ ఉంటుందని తలంచిననూ అట్టి స్థితియందు కూడా నీవీ ప్రకారము శోకించుట తగదు. ఎందుకంటే, పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుకా తప్పదు. తప్పనిసరైన  ఈ విషయమున నీకు ఇంకా శోకించడం సరికాదు. 2.26-27) ఈ ప్రాణులన్నీ పుట్టక ముందు ఎవరికీ కనబడవు. మరణించిన తర్వాత ఎవరికీ కనబడవు. శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే కనబడతాయి. పుట్టుక, చావు ఈ మధ్యనే అదీ శరీరం ఉంది కాబట్టి శరీరాల ద్వారా మనందరి కళ్లకు కనపడుతున్నాయి. ఇట్టివాని విషయమై నీవు శోకింపనేల? (2.28) ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కొందరు దీనిని గూర్చి ఏమియు ఎఱుగరు.  (2.29) ఓ అర్జునా! ప్రతీ శరీరము నందూ ఉండే ఈ అత్మ చంప వీలుకానిది. కనుక ఏ ప్రాణి గురించి అయినా నీవు శోకించడం తగదు (2.30)

శ్రీకృష్ణుడు అర్జునుడికి, యోధునిగా తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు

అంతేకాక స్వధర్మమును బట్టి కూడా నీవు భయపడనవసరం లేదు. ఎందుకంటే క్షత్రియునకు ధర్మయుద్ధమును మించినట్టి శ్రేయస్కరమైనట్టి కర్తవ్యము మరియొకటి ఏదీ లేనేలేదు. (2.31) ఓ అర్జునా! యాదృచ్ఛికముగా సంభవించినట్టి  ఈ యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱిచిన ద్వారము వంటిది. (2.32)  ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము. ఒకవేళ నీవు దీనిని చేయకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయినవాడవు అవుతావు. దానివలన నీవు కీర్తిని కోల్పోతావు. అంతేకాకుండా నీవు పాపము చేసినవాడవవుతావు. (2.33) లోకులందరూ కూడా చాలా కాలము వరకూ నీ అపకీర్తిని గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటే చాలా బాధాకరంగా ఉంటుంది. (2.34) ఈ మహారధుల దృష్టిలో నీవు ఎంతో గొప్పవాడవు. యుద్దానికి విముఖుడవైతే వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అవుతావు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లుగా వీరు భావిస్తారు. (2.35)  నీ శత్రువులు నీ సామర్ధ్యమును నిందించుచూ నీ గురించి అనేకమైన అనరాని మాటలను అందురు. అంతకంటే దు:ఖమేమున్నది? (2.36) ఓ అర్జునా! రణరంగమునందు మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యభోగములను అనుభవింతువు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధానికి లెమ్ము. (2.37) సుఖదు:ఖములయందును, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ది కలిగి యుద్దమునకు సంసిద్ధుడవుకా. ఈ విధంగా చేసినచో నీవు పాపము పొందకుండా ఉండెదవు. (2.38)

కర్మయోగం  ప్రాముఖ్యత, నిస్వార్ధ సేవ

ఓ అర్జునా! ఈ సమత్వ బుద్ధిని జ్ఞానయోగ బుద్ధితో తెల్పితిని. ఇపుడు దానినే కర్మయోగ దృక్పథముతో తెల్పెదను. వినుము. దానిని అర్ధం చేసుకుని ఆచరించినచో, కర్మబంధముల నుండి విముక్తుడవవుతావు. (2.39) ఈ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎప్పటికీ బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే ఉండవు. అంతే కాకుండా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మమృత్యురూప మహాభయమునుండి కాపాడును.(2.40)  ఈ నిష్కామ కర్మయోగమును అవలంబించిన వాడి బుద్ధి ఏకాగ్రంగా, నిశ్చయంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక కోరిక మనసులో పెట్టుకుని దాని కొరకు కర్మచేస్తే వాడి బుద్ధి పరిపరి విధాల పోతుంది. కుదురుగా నిశ్చయంగా ఉండదు. (2.41)

వేదాలు జీవితంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాలతో వ్యవహరిస్తాయి

ఓ అర్జునా! వివేకము లేని మానవులు ప్రాపంచిక సుఖముల కోసం మాత్రమే పాకులాడుతూ ఉంటారు. అటువంటి వారు వేదములలో చెప్పబడిన విషయములను వాటి పైపై అర్ధములతో తీసుకుంటారు. ఎందుకంటే అవి కర్మలను, వాటి వలన వచ్చే ఫలముల గురించి చెబుతాయి. వేదములలో చెప్పబడిన విషయముల అంతరార్ధముల జోలికి పోరు. అటువంటి వారు యజ్ఞములు, యాగములు చేస్తే స్వర్గసుఖాలు లభిస్తాయని, స్వర్గసుఖములకు మించిన సుఖము లేదనీ అనుకుంటూ ఉంటారు. (2.42) ప్రాపంచిక సుఖములను, కోరికలను పొందడానికి అవసరమైన వ్రతాలు మొదలగు సకామ కర్మలను ఆచరిస్తారు. పండితులు కూడా ఈ సకామ కర్మలు వేదములో చెప్పబడ్డాయి అని ప్రచారం చెస్తారు. తియ్యగా ప్రవచనాలు చేస్తారు. (2.43) ఈ తియ్యటి కబుర్లు నమ్మిన మానవులు ఎల్లపుడూ స్వర్గసుఖముల మీద,   లోకంలో లభించే భోగముల మీదా, సంపదల మీద ఆసక్తితో ఉంటారు. భోగైశ్వర్యములు అంటే ఇష్టమున్న జనులకు దైవధ్యానమందు ఏకాగ్రమైన బుద్ధి కలుగనే కలుగదు. (2.44) ఓ అర్జునా! వేదములు సంసార విషయములను తెలుపునవిగా ఉన్నాయి. వేదములలో చెప్పబడిన కర్మకాండలు, కేవలము మూడు గుణములలో అను నిత్యము వర్తించే వారికే గానీ నీకు కాదు. ద్వందాలకు అతీతంగా ఉండాలి. నీవు మాత్రం వాటి గురించి పట్టించుకోకు. వాటిని  విడిచిపెట్టు. సుఖదు:ఖాలకు, జయాపజయాలకు అతీతంగా ఉండు. నీ మనస్సును పరమాత్మ యందు లగ్నం చెయ్యి. నీ యోగక్షేమముల గురించి ఆరాట పడవద్దు. నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. (2.45) నీటితో నిండియున్న మహాజలాశయము, అందుబాటులో ఉన్నవానికి చిన్న జలాశయము ఒకే విధమైన ప్రయోజనాన్ని ఎలా ఇస్తాయో, అలాగే పరమాత్మ ప్రాప్తిని పొందిన బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతే ప్రయోజనం చేకూరుతుంది.(2.46)

కర్మయోగం యొక్క సిద్ధాంతం మరియు ఆచరణ

అర్జునా! కర్తవ్య కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. దాని ఫలితముల యందు నీకు అధికారము లేదు. ఏ కర్మకు ఏ పలితం రావాలనే దానికి నీవు కారణం కాదు. అలా అని కర్మలు చేయకుండా ఉండటం యందు మక్కువ చూపకూడదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్మలు చేయడమే నీకర్తవ్యము. (2.47) ప్రతి వాడు తాను చేయవలసిన కర్మలు తప్పకుండా చేయాలి. ఆ కర్మలను ఒక యోగంగా చేయాలి. చేయబోయే పని మీద అసక్తిని వదిలి, ఆ పని జరుగుతుందా జరగదా అనే అనుమానం వదిలి పెట్టాలి. చేసే పని శ్రద్ధగా చేయాలి. లాభము, నష్టముల మీద సమభావన కలిగి ఉండాలి. ఆ సమత్వమే ఒక యోగము. (2.48)  సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా, ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయడం అంటే సకామ కర్మలు చేయడం చాలా తక్కువ స్ధాయికి   చెందినవి. నీవు సమత్వబుద్ధిరూప యోగమును ఆచరింపుము. ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మలు చేసే వాళ్లు అల్పులు, దీనులు, ఆశావహులు. అటువంటి వారికి దు:ఖమే మిగులుతుంది.  (2.49)

వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ వదిలివేయును. కాబట్టి నైపుణ్యం తో  పని చేయటం అనే, యోగాభ్యాసము చేయుము. ఇదియే కర్మయోగము.  (2.50) సమత్వ బుద్ధి కలవారు తాము కర్మలు చేసినా ఆ కర్మఫలములను విడిచి పెడతారు. అటుంటి వారు జనన మరణ చక్రము నుండి విడివడతారు. శాశ్వత సుఖమును ఇచ్చే మోక్షమును పొందుతారు. (2.51) అర్జునా! నీ బుద్ధి ఎపుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని దాటి వేస్తుందో అపుడిక వినవలసిన దానిని గురించీ వినిన దాని గురించి నీవు విరక్తి కలిగి యుందువు. (2.52)

నానా విధాలైన విషయములు తత్వములు వినడం వలన కలత చెందిన నీ బుద్ధి యెపుడు చలింపకుండా పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి యుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును పొందగలవు. (2.53) అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! నిశ్చలమైన, అచంచలమైన సమాధిస్థితిని పొందిన మానవుడు ఎలా ఉంటాడు? అతడి లక్షణములు ఎలా ఉంటాయి? అతడెట్లు మాట్లాడును?ఎలా ప్రవర్తిస్తాడు? అటువంటి వాడిని గుర్తించడం ఎలాగా! వివరంగా చెప్పుఅని అడిగాడు.(2.54)

జ్ఞానిని గుర్తించడానికి గుర్తులు

భగవానుడు చెప్పెను: స్థిత ప్రజ్ఞుడు అనేవాడికి కోరికలు ఉండవు. కోరికలు అనేవి మనసులో నుండి తొలగిపోతాయి. మనసును ఆత్మయందు లగ్నం చేసి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంటాడు. ఆత్మను పరమాత్మతో సంయోగించి సంతుష్టుడై ఉంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన ఆనందం కంటే అటువంటి ఆనందము గొప్పది అనే అనుభూతిని పొందుతాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. (2.55) దు:ఖము సంభవించినపుడు కుంగిపోనివాడు, సుఖములు ప్రాప్తించినపుడు పొంగిపోనివాడు, రాగమును, భయమును, క్రోధమును వదిలిపెట్టిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అంటారు. (2.56) దేనిమీదా, ఎవరి మీదా ఎక్కువగా మమతానురాగములు లేనివాడు, శుభమును, అశుభమును సమానంగా చూసేవాడు, ఒకరిని అభినందించడం, మరొకరిని ద్వేషించడం చేయనివాడు, అటువంటి వానిలో బుద్ధి చక్కగా ప్రతిష్టితమై ఉంటుంది. (2.57) తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, జ్ఞాని యెపుడు తన జ్ఞానేంద్రియములను బయట ప్రపంచంలో ఉన్న విషయములను సర్వత్రా వెనుకకు మరల్చుచున్నాడో, అపుడాతని జ్ఞానము మిక్కిలి స్థిరమైనది అగును. అతడు స్థిత ప్రజ్ఞుడు. (2.58) సాధకులు ఇంద్రియములను భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును. కాని స్థితప్రజ్ఞుడు అయిన వాడి మనస్సు పరమాత్మలో లీనం అవుతుంది కాబట్టి, అటువంటి ఆసక్తి కూడా ఉండదు. (2.59)

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదాలు

ఓ అర్జునా! ఇంద్రియములు చాలా శక్తివంతమైనవి. అవి జ్ఞానులు, వివేకవంతులు అయిన పురుషుల యొక్క మనసును కూడా చిలుకుతూ ఉండి, క్షోభింపచేస్తుంటాయి. బలాత్మారంగా (విషయాల వైపుకి) తమవైపుకు లాగుతుంటాయి. (2.60) ఇంద్రియములను తన వశంలో ఉంచుకున్న సాధకుడు తన మనస్సును ఆత్మయందు నిలిపి ఉంచాలి. పరమాత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియములు, మనస్సు స్వాధీనంలో ఉన్నవాడి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. (2.61) ఇంద్రియ విషయముల మీద ఆలోచన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది.  అట్టి ఆసక్తి వలన దానియందు ఆతనికి కోరికగా మారుతున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. (2.62) కోపము వలన అవివేకము, అవివేకము వలన మరుపు, మరుపు వలన బుద్ధినాశము క్రమముగా సంభవించుచున్నవి. బుద్ధినాశముచే చివరికి పూర్తిగా చెడినవాడగుచున్నాడు. (2.63)

ఇంద్రియ నియంత్రణ మరియు స్వీయ జ్ఞానం ద్వారా శాంతి మరియు ఆనందాన్ని పొందడం

రాగద్వేషములు లేకుండా తన స్వాధీనంలో మనస్సు, ఇంద్రియములు ఉన్న మానవుడు, బయట ప్రపంచంలో తిరుగుతున్నా, బయట ప్రపంచంలో ఉన్న సుఖాలను అనుభవిస్తున్నా, తాను మాత్రం పరమశాంతంగా ఉంటాడు. (2.64) అటువంటి శాంతిని పొందిన మానవుడికి దు:ఖములు అంటూ ఏమీ ఉండవు. అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ నందే లగ్నమయి ఉంటుంది.  (2.65) ఇంద్రియములు మనస్సు వశంలో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచనా కలుగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం, శాంతి ఎలా లభిస్తుంది?  (2.66)

ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో మునిగి తేలేవాడి మనస్సు బాగా వీస్తున్న గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. (2.67)  కాబట్టి ఓ అర్జునా! నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణా శక్తిని హరించివేస్తాయి. అలా కాకుండా ఇంద్రియాలను, మనసును అదుపులో ఉంచుకున్న వాడి బుద్ధి జ్ఞానము, నిశ్చయంగా, స్థిరంగా ఉంటుంది.  (2.68) సర్వ భూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వ భూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు. (2.69) (ఊహాజనిత ప్రపంచంలో  రాత్రి చాలా మంది నిద్రపోయి, కలల ప్రణాళికలు వేస్తుండగా, ఒక యోగి మాత్రం మేల్కొని లేదా ప్రపంచం నుండి వేరుచేయబడతాడు.)

ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.  (2.70)  కోరికలను వదిలిపెట్టి, మమత, అహంకారము, ప్రాపంచిక విషయముల మీద అసక్తి వదిలిపెట్టి, తిరిగే వాడు నిరంతర శాంతిని పొందుతాడు.  (2.71)  ఓ అర్జునా! దీనినే బ్రాహ్మీస్థితి అని అంటారు.  ఈ బ్రాహ్మీస్థితిని పొందిన వాడు మోహములో పడడు. అతడు తన అంత్యకాలములో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని, పరమ శాంతిని పొందుతాడు. అతడు మరణానికి భయపడడు. ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. (2.72)

3.  వ అధ్యాయము:  కర్మయోగము

అర్జునుడు ఇలా పలికెను:  ఓ కేశవా! నీవు చెప్పిన దానిని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనేది నీ భావన అని తెలుసుకున్నాను. అయితే నన్ను భయంకరమైన, హింసతో కూడిన, సర్వనాశన హేతువైన, ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? కృష్ణా! నీ మాటలు అన్నీ చాలా తికమకగా ఉన్నాయి. నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతూ ఉంది. కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పుము. జ్ఞానం సంపాదించడానికి గురుకులానికి వెళ్ళమంటావా లేక కర్మ మార్గం అనుసరించమంటావా! ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకుని తరువాత నాకు చెప్పు. (3.01-02) శ్రీ భగవానుడు సమాధానమిచ్చెను: ఓ అర్జునా! నీకు ఇంతకు ముందే  ఈ లోకంలో రెండు నిష్టలు అనగా జీవన విధానాలు ఉన్నాయని చెప్పాను కదా! సాంఖ్య యోగులు అంటే జ్ఞాన యోగులకు సాంఖ్య యోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశించబడ్డాయి. ఎవరెవరికి ఏయే యోగము నందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. (3.03) ఎవరికీ కూడా కర్మలు చేయకుండా నైష్కర్య సిద్ధి, ఆత్మజ్ఞానము లభించదు. వారికి జ్ఞానము కూడా కలుగదు. కేవలం కర్మ సన్యాసము (ఏ పనీ చేయకుండా ఉండటం) వలన ఆత్మజ్ఞానము, మోక్షసిద్ధి కలుగదు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికీ అవసరం. (3.04) కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వశుడై ఉండాలి. (3.05) కొంత మంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి, ధ్యానంలో కూర్చుంటారు. కాని మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము. ధ్యానము కాదు. (3.06)

ప్రతీ ఒకరు ఇతరులకు ఎందుకు సేవ చేయాలి?

ఓ అర్జునా! ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి, ఆ నిగ్రహించబడిన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో, అతడిని విశిష్ఠపురుషుడు అని అంటారు. (3.07) నువ్వు శాస్త్రములో చెప్పబడిన కర్మలను, నీవు చేయతగ్గ కర్మలను, నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కనీసం నీ శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్పదు. (3.08) ఇతరుల కోసం, సమాజం కోసం, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, నిష్కామంగా చేసే కర్మలు కాకుండా ఇతర కర్మలను చేయడం వలన మానవులు కర్మబంధనములలో చిక్కుకుంటారు. కాబట్టి ఓ అర్జునా! నీవు కూడా ఎటువంటి ఆసక్తి, అనురక్తి లేకుండా నీ విధిని నీవు నిర్వర్తించు. అప్పుడు నీకు కూడా ఎటువంటి బంధనములు అంటవు. (3.09)

సృష్టికర్త యొక్క మొదటి ఆజ్ఞ, ఒకరికొకరు సహాయపడటం

సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, మీరు యజ్ఞముల ద్వారా వృద్ధి చెందండి. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలన్నింటినీ తీరుస్తాయి అని చెప్పాడు. (3.10) యజ్ఞముల ద్వారా మీరు దేవతను తృప్తిపరచండి. ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్సరము సంతృప్తిపరచుకొనుచు శ్రేయస్సును పొందగలరు. (3.11) యజ్ఞముల వలన దేవతలు తృప్తిచెందుతారు. వారు మానవులకు కోరకుండానే వరాలు ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా, ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతా భావంతో ఎవరికీ నివేదించకుండా తానే అనుభవిస్తాడో, వారు దొంగలతో సమానం. (3.12) యజ్ఞశిష్టమైన ఆహారమును అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినే వారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలం తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినే వారు పాపములు తింటున్నట్లుగా భావించబడుతుంది. (3.13) ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తున్నాయి. వర్షము వలన అన్నము ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వలన కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులు అన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలము పరమాత్మ. ఆ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంటాడు. అందరిలోనూ ఉంటాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉంటాడు. ఇది ఒక చక్రము. నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ( 4.32 లో కూడా చూడండి). (3.14-15) ఓ అర్జునా! ఎవరైతే జరుగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించరో, అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా, ఇంద్రియలోలుడై పాపము చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్ధము. (3.16) ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతుంటాడో, అతడు నిత్యము సంతుష్టుడిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. (3.17) అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం వలన కానీ, చేయకుండా ఉండటం వలన గానీ, ఎటువంటి ప్రయోజనమూ లేదు. అటువంటి సాధకుడికి స్వార్ధబుద్ధి కానీ, బాహ్య ప్రపంచముతో సంబంధము కానీ ఉండదు.  (3.18)

నాయకులు మార్గదర్శకులు కావాలి

ఆ కారణం చేత అర్జునా! నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధాన్ని చెయ్యి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు. నీకు మోక్షం కూడా వస్తుంది. (3.19) పూర్వము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను చేయడం వలన సిద్ధి పొందారు. కావున నీవు కూడా స్వార్ధం వదిలి లోకహితము కోసం కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. (3.20) శ్రేష్టులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు. (3.21) అర్జునా! ఈ మూడు లోకాలలో నేను చేయాల్సిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు. అలాగే నేను కోరుకోదగినది, పొంద తగినది, నేను పొందలేనిదీ ఏదీ లేదు. అయినప్పటికినీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను. (3.22) ఓ అర్జునా! నేను నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. కృష్ణుడే చేయలేదు మేమెందుకు చేయాలి అంటూ ఎవరూ ఏపనీ చేయరు. అంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ అధర్మపరులవుతారు. మానవులందరూ నన్నే అనుసరిస్తారు కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను. (3.23-24) ఎలాగైతా అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మల మీద ఆసక్తి కలిగి ఉండి, వాటినే ఆచరిస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోక హితము కోసం, ఎటువంటి ఆసక్తి, స్వార్ధబుద్ధి లేకుండా, కర్మలు చేస్తుంటారు. (3.25)  ఈ లోకంలో ఎంతో మంది ఆత్మజ్ఞానము కలిగిన వారూ, ఏమీ తెలియని అజ్ఞానులూ ఉన్నారు. జ్ఞానులు అయిన వారు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి, అజ్ఞానులకు చూపించి, వారికి నచ్చచెప్పి, వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి. (  3.29 లో కూడా చూడండి) (3.26)

అన్ని కర్మలు ప్రకృతి నిర్దేశించినవే

ఓ అర్జునా! మానవులు చేసే కర్మలు అన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమోగుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ మూడు గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకార పూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలననే అంతా జరుగుతూ ఉంది అని భావిస్తుంటాడు. (5.09, 13.29, మరియు 14.19 లో కూడా చూడండి) (3.27)  కానీ గుణముల తత్వమును కర్మల స్వభావమును తెలిసిన జ్ఞాని, ప్రకృతిలో ఉన్న మూడు గుణములు తనతో ఉన్న మూడు గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని, ఆ గుణముల యందు, వాటి ప్రభావము నందు ఎటువంటి ఆసక్తి చూపించడు. నిర్లిప్తతగా ఉంటాడు. (3.28) ప్రకృతి గుణముల యొక్క మోహములో పడ్డ వారు ఆ ప్రకృతి గుణములలోనూ ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని, ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని, అన్నీ తెలిసి ఆత్మజ్ఞానము పొందిన జ్ఞానులు, తమ బోధనలతో మోహమునకు గురిచేయకూడదు. (3.26 లో కూడా చూడండి) (3.29) ఓ అర్జునా! నీ చిత్తమును పరమాత్మ యందు నిలిపి, కర్మలను అన్నిటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి, ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలి పెట్టి, క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చెయ్యి (3.30) ఎటువంటి అసూయ లేకుండా, పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడని విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల బంధనాల నుండి విముక్తిని పొందుతారు. అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోపణ చేస్తూ, నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతనులు అంటే బుద్ధిహీనులు, ఏ మాత్రము జ్ఞానము లేని మూఢులు, అన్ని విధాలా నష్టపోయినవారు అవుతారు. (3.31-32)  మానవులే కాదు సకల ప్రాణులు కూడా ప్రకృతి నియమాలను అనుసరించి ప్రవర్తిస్తున్నాయి. అటువంటప్పుడు మానవునికి సహజ గుణములను నిగ్రహించడం వలన, ప్రకృతి స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం వలన మానవుడు ఏమి చేయగలడు? (3.33)

పరిపూర్ణత  మార్గంలో రెండు ప్రధాన అవరోధాలు

ఇంద్రియములకు, రాగద్వేషాలు ఉంటాయి. అంటే ఇది నాకు ఇష్టము ఇది ఇష్టము లేదు అని. ఆ రాగద్వేషములకు లోబడితే బంధనములు తప్పవు. మానవుడు రాగద్వేషములకు లోనుకాకూడదు. ఎందుకంటే రాగద్వేషములు మానవునికి శత్రువులు. (3.34)  చక్కగా ఆచరింబడిన పరధర్మము కంటే, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. స్వధర్మాచరణములో మరణించినా శ్రేయస్కరమే. ఎందుకంటే పరధర్మము చాలా భయంకరమైనది. (  18.47 కూడా చూడండి) (3.35)

కామం (కోరిక) పాపానికి మూలం

అర్జునుడు అడిగాడు: ఓ కృష్ణా! ఎవరూ కావాలని పాపాలు చేయరు కదా! ఏ శక్తి మానవుని చేత చెడ్డపనులు, దుర్మార్గాలు చేయిస్తూ ఉంది? (3.36) శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను: రజోగుణము వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు. కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహమునకు అంతే లేదు. ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి, అనేక మహాపాపాములకు కారణం అవుతూ ఉంటాయి అని తెలుసుకో! (3.37) పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్లు, ఈ కామము దాని వలన పుట్టే క్రోధము, మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది.  (3.38) అర్జునా! ఈ కామము సాధకునిలోని జ్ఞానములను కప్పి ఉంచుతుంది. జ్ఞానులు సాధకుల సంగతే ఇలా ఉంటే, ఇంక సాధారణ మానవుల సంగతి చెప్పేదేముంది?(3.39) ఈ కామము (అంటే చూచినది, విన్నది, ముట్టుకున్నది, రుచి చూసిన ప్రతీది కావాలి అనే తత్వము) మానవుని దేహములో ఉన్న ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది. మానవునిలో ఉన్న మనో, బుద్ధి, ఇంద్రియాలు, తనలో చెలరేగిన కామాలను అన్నింటినీ తీర్చడానికి శతథా ప్రయత్నం చేస్తుంటాయి. అపుడు లోపల ఉన్న ఆత్మజ్ఞానము కప్పబడిపోతుంది. మానవుడు తీవ్రమైన  మోహంలో పడిపోతాడు. (3.40) అందువల్ల, అర్జునా! ఈ కామాన్ని జయించాలంటే, ముందు నీ ఇంద్రియములను, వాటి విషయగ్రహణ శక్తిని అదుపులో పెట్టుకో. తర్వాత కామాన్ని జయించు.  (3.41)

కోరికలను ఎలా నియంత్రించాలి?

ఇంద్రియములు చాలా గొప్పవి. ఇంద్రియముల కన్నా మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడింటి కంటే గొప్పది ఆత్మ. ( 6.07-08 కూడా చూడండి) (3.42) అర్జునా! బుద్ధి కంటే ఆత్మ బలమైనదని చెప్పాను కదా! ఆత్మ తర్వాత బుద్ధి బలమైనదిగా తెలుసుకుని, బుద్ధితో మనసును, ఇంద్రియములను జయించి ఈ రెండింటిని తన స్ధావరములుగా ఏర్పరుచున్న, జయించడానికి కష్టతరమైన కామము అనే శత్రువును జయించు అని బోధించాడు. (3.43)

4.  వ అధ్యాయము:  జ్ఞాన యోగము

కర్మ యోగం ఒక పురాతనమైన సిద్ధాంతం

శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను: అర్జునా! పైన చెప్పబడిన యోగమును నేను ఇంతకు ముందు సూర్యునికి ఉపదేశించాను. సూర్యుడు దానిని వైవస్వత మనువుకు ఉపదేశించెను. మనువు ఆ యోగమును ఇక్ష్వాకువుకు చెప్పాడు. ఈ యోగము ఈ ప్రకారంగా పరంపరానుగతంగా లోకానికి సంక్రమించింది. కాలం గడిచే కొద్దీ, ఈ యోగము అంతరించి పోయింది. ఎవరికీ తెలియకుండా పోయింది. ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే నీవు నాకు బంధువు, మిత్రుడవు, భక్తుడవు. పైగా ఇప్పుడే నన్ను గురువుగా స్వీకరించావు. ఆ కారణం చేత పురాతనమైన ఈ యోగాన్ని నేను నీకు చెప్పాను. ఈ యోగము అతి రహస్యమైనది, అతి ముఖ్యమైనది. (4.01-03) అర్జునుడు అడిగెను: నీవు ఈ కాలం నాటివాడివి. మరి సూర్యుడు, ఆయన కుమారుడు చాలా పురాతనులు. ఈ కాలంలో పుట్టిన నీవు, ఎప్పుడో పుట్టిన సూర్యునికి ఈ యోగము ఉపదేశించడం ఎలా సాధ్యం అయింది? (4.04)

భగవంతుని అవతారం యొక్క ఉద్దేశ్యం

శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను: అర్జునా! నీవు, నేను, ఈ నాటి వాళ్లము కాము. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచిపోయాయి. కానీ గడచిన జన్మల గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. అంతే తేడా. (4.05) నేను ఈ అనంత విశ్వానికి అధిపతిని. నాకు చావు పుట్టుక లేదు. ఈ ప్రకృతి నా స్వాధీనంలో ఉంది. అయినా నా మాయాశక్తితో నేను పుడుతున్నాను. మరణిస్తున్నాను.  ( 10.14 కూడా చూడండి) (4.06) ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు అధర్మము తల ఎగరవేస్తుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను. ఇదీ పరమాత్మ భూలోకమునకు రావడానికి కారణం. సాధువులను అంటే మంచివారిని రక్షించడం, దుర్మార్గులను నాశనం చేయడం, తద్వారా ధర్మమును స్థాపించడం, దీని కొరకు పరమాత్మ యుగయుగములోనూ అవతరిస్తుంటాడు.  (4.07-08) ఎవరైతే నా గురించి నా పూర్వజన్మల గురించి, ఆయా జన్మలలో నేను చేసిన కర్మల గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నాడో, అటువంటి వాడు ఈ జనన మరణ చక్రం నుండి విడివడి నన్నే పొందుతున్నాడు. (4.09) ఎవరైతే రాగము, భయము,కోపము విడిచిపెడతాడో, ఎవరయితే తన మనస్సును నా యందు లగ్నం చేస్తాడో, నన్ను ఆశ్రయిస్తాడో, అటువంటి వారు జ్ఞానము అనే తపస్సు చేత పవిత్రులౌతారు, చివరకు నన్నే పొందుతారు.  (4.10)

ఆరాధన, ప్రార్థన చేసే విధానం

ఓ అర్జునా! ఏయే మానవులు నన్ను ఏ ప్రకారంగా సేవిస్తారో ఆశ్రయిస్తారో, వారికి ఆ ప్రకారంగానే అనుగ్రహిస్తాను. అందుకే మానవులదరూ నన్నే అనుసరిస్తూ నన్నే సేవిస్తున్నారు. (4.11) ఫలితములు ఆశించి కర్మలు చేసే మానవులు ఈ ప్రపంచంలో వివిధమైన దేవతా మూర్తులను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవతామూర్తులను ఆరాధిస్తే వారికి త్వరగా ఫలితాలు లభిస్తున్నాయి.  (4.12) ఈ అనంత విశ్వము నా చేత సృష్టించబడింది. ఈ విశ్వంలో ఉన్న మానవులు వారి వారి గుణములును బట్టి, వారు చేసే కర్మలను బట్టి నాలుగు వర్ణములుగా విభజించబడ్డారు. ఈ సృష్టికి నేనే కర్తను అయినప్పటికీ, అన్ని జీవులలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నప్పటికీ, నిజానికి నేను ఏ కర్మా చేయను. ఏ కర్మా చేయాల్సిన అవసరం నాకు లేదు. (18.41 కూడా చూడండి) (4.13)  నాకు ఏ కర్మలు కానీ వాటి ఫలములు కానీ అంటవు. నాకు కర్మచేయాలనే కోరిక కూడా లేదు. అవసరం అంతకన్నా లేదు. నా లక్షణములను గురించి తెలుసుకున్నవాడు, ఎటువంటి కర్మల చేతా బంధింపబడడు. (4.14) నన్ను అనుసరించిన ముముక్షువులు, మునులు ఎంతో మంది నిష్కామ కర్మలు ఆచరించి ముక్తి పొందారు. నీవు కూడా నీ పూర్వీకులు ఆచరించిన విధంగా ఆచరించు. (4.15)

విహిత, వికర్మ మరియు అకర్మ కర్మలు

కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? అర్జునా ఈ విషయంలో వేదములు, శాస్త్రములు చదువుకున్న పండితులు కూడా ఏమీ తెలుసుకోలేక పోయారు. ఏది తెలుసుంటే నీకు ఈ కర్మబంధనాల నుండి విముక్తి కలుగుతుందో, దాని గురించి చెబుతాను, శ్రద్ధగా విను. (4.16) కర్మలు మూడు విధములు. మొదటిది కర్మ అంటే ప్రతీవాడు చేయతగిన పని, దీనినే విహిత కర్మ అని కూడా అంటారు. రెండవది వికర్మ అంటే చేయకూడని కర్మ. అంటే నిషేధించబడిన కర్మ. మూడవది అకర్మ. చేయవలసిన పని చేయకపోవడం.  (4.17)

కర్మయోగి కర్మబంధనాలకు లోబడి ఉండడు

ఎవరైతే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూస్తుంటాడో, అతడు వివేకము కలవాడు, యుక్తుడు అని అనబడతాడు. అతడు సకల కర్మలను ఆచరించిన వాడు అవుతాడు. (3.05, 3.27, 5.08 మరియు 13.29 చూడండి) (4.18)   ఎవరైతే కోరికలు లేకుండా నిష్కామంగా, కర్తృత్వభావన లేకుండా కర్మలు చేస్తాడో, అటువంటి వారి యొక్క కర్మలు, కర్మల ఫలములు, కోరికలు జ్ఞానము అనే అగ్నిలో దగ్ధము అవుతాయి. అటువంటి వాడు సాధకుడు, పండితుడు. (4.19) ఎవరైతే కర్మఫలముల మీద ఆసక్తిని వదిలిపెడతారో, ఎవరైతే దొరికిన దానితో తృప్తిపడుతూ ఎవరిమీదా, దేనిమీదా ఆధారపడరో, అటువంటి వారు కర్మలు చేసేనప్పటికినీ, ఏ కర్మ చేయనట్లే అవుతుంది. (4.20) ఆశలేనివాడు, ఇంద్రియములను, మనస్సులను నిగ్రహించుకుని, ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును ఉచితంగా కానీ, అనవసరంగా కానీ తీసుకోని వాడూ, అయిన సాధకునికి తాను ఈ శరీర పోషణ కొరకు చేసిన కర్మల వలన ఎటువంటి బంధనములు, పాపములు అంటవు.  (4.21) అనుకోకుండా, లభించినదానితో తృప్తిపడేవాడు, సుఖము, దు:ఖము మొదలగు ద్వంద్వములకు అతీతంగా ఉండేవాడు, ఇతరుల పట్ల ఎటువంటి మాత్సర్యము లేని వాడు, అందరి పట్ల, తాను చేసే అన్ని కర్మ ఫలముల పట్ల, సమభావము కలిగినవాడు, అటువంటి సాధకుడు ఏ కర్మ చేసినా ఆ కర్మఫలము అతనిని బంధించదు. (4.22) ప్రాపంచి విషయముల యందు కోరికలను వదిలి పెట్టినవాడు, ఆత్మజ్ఞానమందు మనసు నిలిపినవాడు, అన్ని కర్మలను న్యాయంగా, ధర్మంగా, ఒక యజ్ఞం చేసినట్లు సమాజ శ్రేయస్సు కోసమే చేసేవాడు, అటువంటి వాడు, ఏ పని చేసినా ఆ కర్మఫలము అతనిని అంటదు. (4.23) యజ్ఞం చేసేటప్పుడు, హోమ ద్రవ్యాలు, హోమంలో వెలుగుతున్న అగ్ని, యజమాని, ఋత్విక్కలు, ఇవి అన్నీ కూడా బ్రహ్మస్వరూపాలే అంతా బ్రహ్మమే అనుకంటూ ఏకాగ్రచిత్తంతో యజ్ఞము మొదలగు కర్మలను చేసేవాడు చివరకు ఆ బ్రహ్మలో ఐక్యం అవుతాడు.  (9.16) (4.24 చూడండి)

వివిధ రకాల ఆధ్యాత్మిక పద్ధతులు

కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞమునే ఆచరిస్తున్నారు. మఱికొందరు జీవబహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్ని యందు హోమము చేయుచున్నారు.  కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనెడి అగ్నులయందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనెడి అగ్నుల యందును హోమము చేస్తున్నారు. మరికొందరు మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమము చేయుచున్నారు. కొందరు సంపదను దానధర్మాది మంచి విషయములందు వినియోగించుచున్నారు. కొదరు తపస్సే యజ్ఞముగా కలవారై ఉన్నారు. వారందరూ ప్రయత్నశీలురూ,దృఢవ్రతములు కలవారూ అయి ఒప్పుచున్నారు. (4.25-28) ప్రాణాయామ తత్పరులగు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువు నందు ప్రాణ వాయువును, ప్రాణ వాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు. (పూరక, కుంభక, రేచకములును సాధనచేస్తున్నారు) (4.29) మరి కొంత మంది ఆహార నియములను నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు. మనసును ఆత్మతో కలుపుతారు. ఇది ఆఖరి యజ్ఞము.  (4.30) పైన చెప్పబడిన యజ్ఞములు చేసిన తర్వాత యజ్ఞప్రసాదమును స్వీకరిస్తేనే వారికి శాశ్వతమైన బ్రహ్మపదము లభిస్తుంది. యజ్ఞము చేసిన తర్వాత చేసే భోజనము కూడా యజ్ఞఫలము, యజ్ఞ శేషము అవుతుంది. అటువంటి యజ్ఞము కనీసం ఒకటైనా చేయాలి అప్పుడే ఈ మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత కలుగుతుంది. ఏమీ చేయలేకపోతే  లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖం కలుగదు. ( 4.38, మరియు  5.06 చూడండి). (4.31)  ఓ అర్జునా!  ఈ ప్రకారంగా వివిధ రకాలైన యజ్ఞములు అన్నీ వేదంలో చెప్పబడ్డాయి.  యజ్ఞములు అన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో !( 3.14) (4.32 కూడా చూడండి)

అతీంద్రియ జ్ఞానాన్ని పొందడం ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన

ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది ఓ అర్జునా! సమస్త కర్మలూ నాశము కానివగుచు (ఫలసహితముగ) జ్ఞానము నందే పరిసమాప్తమగును.  (4.33)  అర్జునా! అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి, సమయము చూసి వినయముగ ప్రశ్నించి సేవచేసి వారివలన తెలుసుకో. వారు తప్పక నీకు ఉపదేశము చేయగలరు. (4.34) ఏది తెలుసుకుంటే, మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో, అట్టి జ్ఞానమును మంచి గురువుకు శుశ్రూష (సేవలు) చేసి తెలుసుకో!  (4.35) ఒకవేళ పాపాత్ములందరి కంటెను నీవు ఎక్కువ  పాపము చేసినవాడవైతే ఆ సమస్త పాప సముద్రమును  జ్ఞానమను తెప్పచేత తప్పక దాటివేయగలవు. (4.36) బాగా మండుతున్న అగ్ని తనలో వేసిన కట్టెలను ఏ విధంగా భస్మం చేస్తుందో, అలాగే జ్ఞానము అనే అగ్ని సర్వ కర్మలను భస్మము చేస్తుంది. (4.37)

కర్మయోగికి అతీంద్రియ జ్ఞానము దానంతదే తెలుస్తుంది

ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగ పవిత్రమైనది ఏదీ లేదు. అట్టి జ్ఞానమను యోగస్థితిని పొందిన వాడు కాలక్రమంలో తనయందే స్వయముగ పొందుతున్నాడు. ( 4.31, మరియు 5.06, 18.78 చూడండి) (4.38) శ్రద్ధకలవాడు, నిష్ఠ కలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు, జ్ఞానము లభించిన తర్వాత పరమశాంతిని పొందుతున్నాడు. (4.39) విచక్షణా జ్ఞానం లేనివాడు, చేసే పని మీద శ్రద్ధ, విశ్వాసము లేని వాడు, ఎల్లప్పుడూ ప్రతి దానినీ సందేహించేవాడు, ఎప్పటికీ బాగుపడడు. ఎప్పుడూ ఏదో ఒక సందేహముతో సతమతమవుతూ ఉండేవాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేడు.  (4.40)

నిర్వాణానికి అతీంద్రియ జ్ఞానం మరియు కర్మయోగం రెండూ అవసరం

నిష్కామ కర్మయోగమును అవలంబించి, తాను చేసిన కర్మల ఫలములను వదలిపెట్టిన వాడిని, తాను సంపాదించుకున్న జ్ఞానము చేత తన సందేహములను అన్నింటినీ పోగొట్టుకున్నవాడినీ, ఆత్మజ్ఞానము కలిగిన వాడిని, అతడు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు.  (4.41) ఓ అర్జునా! నీలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానం అనే కత్తితో నీలో తలెత్తే సందేహాలను నరికెయ్యి. అలా నిరుత్సాహంగా కూలబడకు.  లే. ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి. నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు.  (4.42)

5.  వ అధ్యాయము: కర్మ సన్యాస యోగము

అర్జునుడు పలికెను: కృష్ణా! నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని చెపుతున్నావు మరలా కర్మయోగము మంచిది అంటున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలిగిస్తుందో,  ముందు నీవు నిశ్చయించుకుని తర్వాత నాకు చెప్పు. (5.05 కూడా చూడండి) (5.01) భగవానుడు చెప్పెను: అర్జునా! కర్మయోగము, కర్మసన్యాసము ఈ రెండూ ఒకటేనయ్యా, రెండూ శ్రేయస్సును కలుగచేస్తాయి కానీ ఈ రెండిటిలోనూ కర్మలను సన్యసించడము కంటే కర్మ చేయడమే శ్రేష్టము (5.02) అర్జునా ఎవరైతే రాగద్వేషములను అదుపులో ఉంచుకుని ద్వంద్వములు లేకుండా (లాభ నష్టాలు, జయాపజయాలు, సుఖదు:ఖాలు) అతీతంగా ఉంటారో, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు.

రెండు మార్గాలు పరమాత్మ చెంతకే చేరతాయి

అజ్ఞానులు మాత్రమే కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము మరియు కర్మ యోగము (భక్తి తో పని చేయటము) వేరువేరని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యదార్థము తెలిసినవారు మాత్రమే చెప్తారు. (5.04) జ్ఞాన యోగము అవలంబించిన సాంఖ్య యోగులు ఎటువంటి స్థానం పొందుతారో  కర్మయోగము అవలంబించిన వారు కూడా అదే స్థానంను పొందుతారు.  సాంఖ్యమును, యోగమును ఎవరైతే ఒకటిగా చూస్తారో, వారే నిజంగా చూచినవారు తెలిసిన వారు అవుతారు. ( 6.01 మరియు 6.02 కూడా చూడండి) (5.05) భక్తి యుక్తముగా పని చేయకుండా (కర్మ యోగము)  పరిపూర్ణ కర్మ సన్యాసము ను చేరుకొనుట చాలా కష్టము, ఓ అర్జునా! కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మ ను పొందును. ( 4.31,మరియు 4.38 కూడా చూడండి) (5.06) పరిశుద్ధ మైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలో ఆత్మను పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. (5.07)

కర్మయోగి భగవంతుని కోసమే కర్మలు చేస్తాడు

కర్మ యోగములో ధృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు - చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, విసర్జిస్తున్నప్పుడూ, తీసుకుంటున్నప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ - "చేసేది నేను కాదు" అన్ని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం తో గ్రహిస్తారు. ( 3.27, 13.29, మరియు 14.19 కూడా చూడండి) (5.08-09) సమస్త మమకార ఆసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు, తామరాకు నీటిచే తడి అవ్వనట్టు, పాపముచే తాకబడరు. (5.10) యోగులు, మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరము, మనస్సు, ఇంద్రియములు, మనస్సు లతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. (5.11) వారు చేసే అన్ని కర్మల ఫలములను భగవంతునికే అర్పితము చేసి, కర్మ యోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో, తమ కామముచే (కోరికలచే)  ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనం కోసం పని చేసే వారు, కర్మ బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.(5.12)

ఆధ్యాత్మి జ్ఞానము యొక్క మార్గం

ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ  తొమ్మిది ద్వారములు కల శరీరములో సంతోషంగా ఉంటారు. (5.13) కర్తుత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు.  భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటిని ప్రవర్తిల్లచేయును. (5.14) సర్వాంతర్యామి అయిన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్య కర్మల యందు కూడా పాలు పంచుకోడు.  జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.(5.15) కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, ఆత్మ పట్ల అజ్ఞానం నాశనం చేయబడునో, వారికి, సూర్యుడు పగటి పూట అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు, ఆ జ్ఞానము వారికి పరమాత్మను ప్రకాశింపచేయును.. (5.16) తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని ధృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన కిరణాలచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.(5.17)

దివ్య జ్ఞానిని గుర్తించడానికి అదనపు గుర్తులు

నిజమైన పండితులు, దివ్య జ్ఞాన నేత్రాలతో ఓ బ్రాహ్మణుడిని, ఓ కుక్కనీ, ఓ ఆవుని, ఓ ఏనుగునీ, ఓ చండాలుడిని సమ దృష్టితో చూస్తారు. ( 6.29 కూడా చూడండి) (5.18) సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మ లోనే జన్మ-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు. (18.55 కూడా చూడండి) (5.19) భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు ధృడమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి లభిస్తే పొంగిపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే క్రుంగిపోరు. (5.20) బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివాడు, ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తాడు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. (5.21) ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ కారణాలే. ఓ అర్జునా! ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటి యందు రమించరు. (18.38 కూడా చూడండి) (5.22) ఈ శరీరమును విడిచి పెట్టక ముందే ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు. (5.23) ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. (5.24) ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు నియమబద్ధమైనవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు. (5.25) నిరంతర ప్రయాస ద్వారా కామ-క్రోధముల నుండి బయట పడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మ-జ్ఞానం లో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పర లోకాలలో భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభిస్తుంది. (5.26)

మూడవ మార్గం --- భక్తి ధ్యానం మరియు ధ్యానం యొక్క మార్గం

అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి, దృష్టి కను బొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రములలో లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నిలిపి, ఈ విధంగా ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని నిగ్రహించి, కామ-క్రోధ-భయ రహితుడైన ముని సర్వదా మోక్ష స్థితి యందే వసించును. (5.27-28) సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తని నేనే అని, సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందును. (5.29)

6.  వ అధ్యాయము: ధ్యాన యోగము

కర్మ యోగి కూడా పరిత్యాగి

భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకానీ, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు. (6.01) సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. (  5.01, 5.05, 6.01, మరియు 18.02 చూడండి) (6.02)

యోగం మరియు యోగి నిర్వచనం

యోగంలో పరిపూర్ణత సాధించే ప్రయత్నంలో ఉన్న  జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు; ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కాబట్టి. (6.03-04)

మనస్సే ఒక స్నేహితుడు మరియు శత్రువు

నీ మనస్సుకున్న శక్తి చేత నిన్ను నీవు ఉద్దరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు.  అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. (6.05-06) మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. (6.07) జ్ఞానము, విజ్ఞానవిచక్షణ కలిగి తృప్తి తో ఉన్నయోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టి, రాళ్ళు మరియు బంగారము వీటన్నిటిని ఒకే దృష్టి తో చూస్తారు. (6.08) శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా,  పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడు గా పరిగణించబడుతాడు. (6.09)

ధ్యానము- పద్ధతులు

యోగ స్థితిని పొందగోరే వారు, నియంత్రించబడిన మనస్సు-శరీరంతో భగవత్ ధ్యానంలో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, ఏకాంతంలో ఉండాలి. (6.10) యోగాభ్యాసము చేయటానికి, శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి; దీని కోసం కుశ గడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. (6.11-12) అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి; ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి. (4.29, 5.27, 8.10, మరియు 8.12 కూడా చూడండి) (6.13-14) ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపి, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి 'నిర్వాణమును' పొందును మరియు నా యందే పరమ శాంతి తో స్థితుడై ఉండును. (6.15)

ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో - వారు యోగములో విజయం సాధించలేరు. (6.16) కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఖములను ఉపశమింపచేయవచ్చు. (6.17) వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమ శ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సు మీదనే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు. (6.18) గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును. (6.19)

ఎప్పుడైతే, మనస్సు, భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆత్మానందములోనే రమించును. (6.20) సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అపరిమితమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి, నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు. (6.21) ఆ స్థితిని పొందిన తరువాత మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు.  ఈ విధంగా స్థితమై ఉన్నవాడు, ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా ఏమాత్రం చలింపడు.(6.22) దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు.  ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి అపనమ్మకం లేకుండా సాధన చేయవలెను; (6.23) ప్రాపంచిక తలంపులతో నుండి వచ్చిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను.  క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధిలో దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరేదాన్ని గురించి ఇక ఆలోచించదు. (6.24-25) ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. (6.26)

యోగి అంటే ఎవరు?

మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ-ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, అన్నిటినీ భగవత్ సంబంధముగా చూసేవాడు అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది. (6.27) స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్చ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.(6.28) నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు (  4.35, 5.18 కూడా చూడండి) (6.29) ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను. (6.30) నా యందే ఏకత్వంతో స్థితుడై ఉండి, నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్యకలాపములు చేస్తున్నా, నా యందే నివసించును. (6.31) ఓ అర్జునా! సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను. (6.32)

మనస్సును నిగ్రహించడానికి రెండు పద్ధతులు

అర్జునుడు పలికెను: ఓ మాధవా! నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది.  దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది. (6.33-34) శ్రీ కృష్ణ పరమాత్మ అన్నాడు:  ఓ అర్జునా! నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది.  కానీ, సాధన మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. (6.35) మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది.  కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. (6.36)

యోగ లక్ష్యము సాధించని యోగి పరిస్థితి

అర్జునుడు పలికెను : ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయాన్ని ఈ జన్మ లోనే సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి ? (6.37) ఓ కృష్ణా, యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా? (6.38) ఓ కృష్ణా, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము, మరి ఇక నీ కన్నా ఇది చెప్పగలవారు ఎవరున్నారు? (15.15 కూడా చూడండి) (6.39) ఓ అర్జునా! ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకంలో కానీ, పర లోకంలో కాని చెడిపోడు.  ప్రియ మిత్రమా, భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు. (6.40)

యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల, సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు.  ఇటువంటి జన్మ చాలా దుర్లభము. (6.41-42) ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ అర్జునా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమ చేస్తారు. (6.43) వారు, తమ ఇష్టానుసారం కాకపోయినా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు.  ఇటువంటి సాధకులు వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు సహజంగానే అతీతంగా ఎదుగుతారు. (6.44) అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై ఈ జన్మ లోనే సిద్ది  పొందుతారు. (6.45)

ఎవరు ఉత్తమమైన యోగి?

ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మలు చేయువారి కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము. (6.46) అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసం తో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను. ( 12.02 మరియు 18.66 కూడా చూడండి) (6.47)

7.    అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము

భగవంతుడు పలికెను : ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లయితే నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము. (7.01) ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను. (7.02) వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ది కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ది సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు. (7.03)

పదార్థం, స్పృహ మరియు ఆత్మ గురించి నిర్వచనాలు

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు. ( 13.05 కూడా చూడండి) (7.04) ఇది నా తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది.  అదే జీవాత్మ శక్తి, ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. (7.05) సమస్త జీవ రాశులు నా  ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పతిస్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమై పోతుంది (13.26 కూడా చూడండి) (7.06)

సర్వోన్నత ఆత్మ అన్నింటికీ ఆధారం

నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా.  పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి. (7.07) నీటి యందు రుచిని నేను, సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారము, ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్ధ్యమును. భూమి యొక్క స్వచ్చమైన వాసనను నేను మరియు అగ్ని లోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే. (7.08-09) ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే. ( 9.18 మరియు 10.39 కూడా చూడండి).  బలవంతులలో కామరాగరహితమైన బలము నేను.  ధర్మ విరుద్ధము కాని లైంగిక క్రియలను నేనే. (7.10-11) భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్త్వము, రజస్సు, తమస్సు నా శక్తి వల్లనే వ్యక్తమయినాయి.  అవి నా యందే ఉన్నాయి కానీ నేను వాటికి అతీతుడను. ( 9.04 మరియు 9.05 కూడా చూడండి) (7.12) మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై,  ఈ లోకంలోని మానవులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. (7.13)

భగవంతుని శరణు కోరేదెవరు?

ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు. ( 14.26, 15.19, మరియు 18.66) (7.14) నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు - జ్ఞానము లేని వారు, నన్ను తెలుసుకునే సామర్ధ్యం ఉన్నా సోమరితనం తో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, ఆసురీ ప్రవుత్తి కలవారు. (7.15)

ఓ అర్జునా, నాలుగు రకాలైన ధర్మ-పరాయణులు నా పట్ల భక్తి తో నిమగ్నమవుతారు ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు. (7.16) వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల ధృడ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు. (7.17) నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో, ధృడ నిశ్చయముతో ఉండి, బుద్ధి నా యందు ఐక్యమై, కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యం గా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను. ( 9.29 కూడా చూడండి) (7.18) ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడు, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు.  అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు. (7.19) భౌతిక ప్రాపంచిక కోరికలతో జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు.  వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు; ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు. (7.20)

మనం ఏరూపంలో కోరుకుంటే ఆ రూపంలో భగవంతుడు కనిపించగలడు

భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.  శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును.  కానీ, నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే.  (7.21-22) కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు, అదే సమయంలో, నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు.(7.23)

పరమేశ్వరుడైన నన్ను, శ్రీ కృష్ణుడిని - ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు.  అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నా సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు. (7.24) నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ వ్యక్తమవ్వను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పుచెందని వాడినని తెలుసుకోలేరు. (7.25)

అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియదు. (7.26)  రాగ, ద్వేషములనే ద్వందములు, భ్రాంతి నుండే పుట్టుచున్నవి.  ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయ బడుచున్నది. (పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల నుండి మోహము నుండి విముక్తి పొందుతారు.  అటువంటి వారు నన్ను ధృడ సంకల్పముతో పూజిస్తారు (7.27-28) ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మంను, తమ ఆత్మ తత్త్వమును, సమస్త కర్మ క్షేత్రమును తెలుసుకుంటారు. (7.29) సమస్త  పదార్థ క్షేత్రము, దేవతలు, మరియు యజ్ఞములకు ఈశ్వరులకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు. (8.04 కూడా చూడండి) (7.30)

8.  వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము

అర్జునుడు పలికెను:  ఓ కృష్ణా!  ఆ బ్రహ్మము  అనగా ఏమిటి? అధ్యాత్మము  అనగా ఏమిటి? కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, ధృడ సంకల్పముతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియటానికి ఎలా సాధ్యము? (8.01-02)

ఆది దైవము, ఆదిభూతము, ఆది యజ్ఞము యొక్క నిర్వచనాలు

శ్రీ భగవానుడు పలికెను: సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అంటారు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మము అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. (8.03) నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే ఆదిభూతమంటారు; సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే ఆధిదైవము అంటారు; సర్వ భూతముల హృదయములలో నివసించే నేను ఆధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు, అని పిలువబడుతాను. (8.04)

పునర్జన్మ మరియు కర్మ సిద్ధాంతం

మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు.  ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. (8.05) మరణ కాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో దేనినైతే గుర్తుచేసుకుంటాడో,  ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన అతను ఆ స్థితినే పొందును. (8.06)

భగవంతుని-సాక్షాత్కారానికి సులువు మార్గము

కాబట్టి, సర్వ కాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు; ఈ విషయంలో సందేహం లేదు. (8.07) సాధనతో, నిరంతరంగా మనస్సుని, ఎటూ పోనీయక, పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు. (8.08) భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. (4.29, 5.27, 6.13 కూడా చూడండి) (8.09-10) వేద పండితులు ఆయనను నాశనము  చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం  మార్గాన్ని క్లుప్తముగా వివరిస్తాను. (8.11)

మరణ సమయంలో భగవంతుడిని ధ్యానించడం ద్వారా మోక్షాన్ని పొందండి

శరీరము  అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము నందే నిలిపి, ప్రాణములను తల స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను.  పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వాడు పరమ గతిని పొందును. (8.12-13) ఓ అర్జునా! అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను ఎందుకటే వారు నిరంతరం నాయందే నిమగ్నమై ఉంటారు కాబట్టి (8.14) నన్ను పొందిన పిదప, మహాత్ములకు, ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు, ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు. (8.15) బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కానీ నా ధామమునకు చేరిన తర్వాత, ఇక మరల పునర్జన్మ ఉండదు. (  9.25 కూడా చూడండి) (8.16)

సృష్టిలోని ప్రతిదీ పునరావృతమవుతుంది

వెయ్యి చతుర్యుగములు అంటే మహాయుగము ( బ్రహ్మ దేవునికి ఒక రోజు ( కల్పము అవుతుంది,  ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది.  దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు రాత్రి  యదార్థాన్ని అర్థం చేసుకుంటారు. (8.17) బ్రహ్మ పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి.  ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి. (8.18) బ్రహ్మకు  పగలు మొదలవగానే సమస్త జీవ రాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మకు రాత్రి ప్రారంభమవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మపగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. (8.19)

  వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కంటెను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్థిత్వం కలదు.  మిగతా అన్నీ నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.  (ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దానిని చేరిన తరువాత వ్యక్తి ఈ లౌకిక  లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము. (8.20-21) సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు.  ఆయన సర్వ వ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడుతాడు. ( 9.04 మరియు 11.55 చూడండి) (8.22)

నిష్క్రమణ (మరణించడం) యొక్క రెండు ప్రాథమిక మార్గాలు

ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, దీనిలో ఒకటి మోక్షమునకు మార్గము మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది.  (8.23) సర్వోన్నత బ్రహ్మం గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు.  (8.24) వైదిక కర్మ కాండలని ఆచరిస్తున్నవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు.  స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు.  (8.25) ఈ రెండు - ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది. (8.26)

అతీంద్రియ జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది

ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు, ఓ పార్థా, ఎన్నటికీ మోహమునకు గురి కారు.  కాబట్టి, అన్ని సమయాల్లో యోగములో స్థితుడవై భగవంతునితో ఏకమై ఉండుము. (8.27) ఈ రహస్యం తెలిసిన యోగులు - వైదిక కర్మ కాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మాలు చేయుట - వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు.  ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు. (8.28)

9.  వ అధ్యాయము: రాజవిద్యా రాజగుహ్య యోగము

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, నీకు నామీద అసూయ లేదు కాబట్టి,   అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు తెలియజేస్తాను; ఇది తెలుసుకున్న తరువాత నీవు భౌతికసంసార బాధల నుండి విముక్తి చేయబడుతావు. (9.01)

భగవంతుని ప్రాకృతిక జ్ఞానము అత్యంత రహస్యమైనది

ఈ జ్ఞానము అన్ని విద్యలకు రారాజు మరియు అత్యంత రహస్యమయినది. ఇది విన్న వారిని పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది. (9.02) ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు,  వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు. (9.03) ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది.  సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను. ( 7.12 కూడా చూడండి) (9.04) అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి అద్భుతమును తిలకించుము! నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయినా, నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతి చే కానీ ప్రభావితము కాను. (9.05) (బంగారు గొలుసు బంగారంపై ఆధారపడి ఉంటుంది, మరియు పాల ఉత్పత్తులు పాలుపై ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి, బంగారు గొలుసు బంగారంపై ఆధారపడదు; గొలుసు బంగారం తప్ప మరేమీ కాదు. అదేవిధంగా, పదార్థం మరియు శక్తి భిన్నంగా ఉంటాయి) అంతటా వీచే ప్రబలమైన గాలి కూడా, ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థితమై ఉన్నట్టు, అదే విధంగా, సర్వ ప్రాణులు కూడా ఎల్లప్పుడూ నా యందే స్థితమై ఉంటాయి (9.06)

ఆవిర్భావం మరియు అవ్యక్త సిద్ధాంతం

అర్జునా! ఒక కల్పము అంతము అయిన తర్వాత ఈ చరాచర భూతకోటి అన్నీ నా  మూల ప్రకృతిలో అవ్యక్త రూపంలో దాగి ఉంటాయి. (9.07) మరొక కల్పము మొదలుకాగానే, నా  ప్రకృతిలో అవ్యక్తముగా ఉన్న ఈ సృష్టి అంతా మరలా నా చేత ప్రకటింపబడుతుంది.  ( 8.17 కూడా చూడండి) (9.08) నేను సమస్త భూతకోటి చేసే కర్మలయందు ఆసక్తిలేని వాడనై, కేవలం ఉదాసీనంగా చూస్తూ ఉంటాను. అందుచేత వారు చేసే కర్మలు, వాటి ఫలములు నన్ను బంధించవు. (9.09) ఓ అర్జునా!  జగత్తుకు అంతా నేను అధ్యక్షుడను. ఈ చరాచర ప్రకృతి, అందులోని సృష్టి నా ఆధ్వర్యములోనే జరుగుతున్నాయి. ఈ జగత్తు అంతా ఒక నియతి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంది. నేను మాత్రం సాక్షిగానే ఉంటాను. ఏమీ చేయను.  ( 14.03 కూడా చూడండి) (9.10)

జ్ఞానుల మరియు అజ్ఞానుల మార్గాలు

నా పరమతత్వమును తెలియని మూఢులైన మానవులు, నేను కేవలం కృష్ణుడు అనే శరీరం ధరించిన మానవుడననీ, నేను కూడా వారి లాగే ఉంటాననీ నన్ను నానావిధములుగా అవమానిస్తున్నారు. ఇటువంటి వారికి పనికి మాలిన, వ్యర్ధమైన ఆశలు, కోరికలు ఉంటాయి. వీరి బుద్ధి పనిచేయదు, మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. రాక్షస భావాలు, అసుర భావాలు కలిగి ఉంటారు. నన్ను గుర్తించలేరు. ( 16.04-18 కూడా చూడండి) (9.11-12) ఓ పార్థా, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, నన్నే, శ్రీ కృష్ణ పరమాత్మనే, సమస్త సృష్టికి ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమౌతారు. ( 16.01-03 కూడా చూడండి), (9.13) ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, ధృడ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తి తో ఆరాధిస్తుంటారు. (9.14) మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు.  కొందరు నన్ను తమతో అబేధమైన ఏకత్వముగా చూస్తారు, మరికొందరు నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు.  ఇంకా కొందరు నా  విశ్వ రూపమును అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు (9.15)

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది

నేనే వైదిక క్రతువును, నేనే యజ్ఞమును మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును. నేనే ఔషధము, నేనే వేద మంత్రమును. నేనే  నెయ్యి, నేనే అగ్ని, నేనే సమర్పించే కార్యమును.  ఈ జగత్తుకి నేనే తండ్రి.  జగత్తుకి నేనే తల్లిని, సంరక్షకుడిని నేనే; పితామహుడుని నేనే; నేనే పవిత్రం చేసేవాడిని; జ్ఞానం యొక్క లక్ష్యమును, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే. ( 4.24 కూడా చూడండి). నేనే సమస్త భూతముల సర్వోన్నత లక్ష్యమును, మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడను, స్వామి, సాక్షి, నివాసము, ఆశ్రయము మరియు స్నేహితుడను.  నేనే సృష్టికి మూలము, అంతము, మరియు ఆధారము; నేనే శాశ్వతస్థానమును మరియు సనాతన బీజమును. ( 7.10 మరియు 10.39 కూడా చూడుము) (9.16-18) నేను సూర్యుని రూపంలో వేడిమిని ప్రసరిస్తాను.  నేనే వర్షమును ఆపుతాను, కురిపిస్తాను.  నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను. ఓ అర్జునా, నేనే శాశ్వతమైన ఆత్మను, తాత్కాలికమైన పదార్ధమును కూడా నేనే. (పరమాత్మే ప్రతిదీ అయ్యింది.  13.12 కూడా చూడండి) (9.19)

భక్తి పూర్వక ప్రేమ ద్వారా మోక్షాన్ని పొందడం

వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండల పట్ల మొగ్గుచూపేవారు, నన్ను యజ్ఞ యాగాదులచే పూజిస్తారు.  యజ్ఞ శేషము అయిన సోమ రస పానము చేయటం ద్వారా పాపాలన్నీ పోయి, పవిత్రులైన వీరు, స్వర్గ లోకాలకు పోవటానికి ఆశిస్తారు.  వారి పుణ్య కర్మల ఫలంగా, వారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుని లోకానికి వెళతారు, మరియు, దేవతల విలాసాల భోగాలన్నీ అనుభవిస్తారు. (9.20) స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు.  ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు. ( 8.25 కూడా చూడండి) (9.21)

సదా నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు, అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను. (9.22)  ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్నే పూజిస్తారు.  కానీ, అది వారు తప్పు పద్దతి లో చేసినట్టు. (9.23) సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. (9.24) దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు. (8.16  కూడా చూడండి) (9.25)

ప్రేమ, భక్తితో భగవంతుని ఏది సమర్పించినా స్వీకరిస్తాడు

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను. (9.26) ఓ అర్జునా! నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము.        (12.10, 18.46 కూడా చూడండి) (9.27) అన్ని పనులను నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడుతావు.  సన్యాసముచే నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడుతావు మరియు నన్ను చేరుకుంటావు. (9.28)

క్షమించరాని పాపి  ఎవరూ ఉండరు

నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధి తో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతం తో కానీ లేదా విరోధ భావంతో కానీ ఉండను.  కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను. (7.18 కూడా చూడండి) (9.29) పరమ పాపిష్ఠివారు అయినా సరే, నన్ను అనన్య భక్తి తో పూజిస్తే, వారిని ధర్మాత్ములుగానే పరిగణించాలి, ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి. (9.30) త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు, మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు.  నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యముగా ప్రకటించుము. (9.31)

భక్తి ప్రేమ మార్గం సులభం

వారి జన్మ, జాతి, కులము ఏదైనా, లింగభేదం లేకుండా, సమాజము అసహ్యించుకునేవారయినా, నన్నుశరణు పొందిన వారంతా పరమ పదమును పొందుతారు. ( 18.66 కూడా చూడుము) (9.32) ఇక పుణ్యాత్ములైన రాజులు, మునుల గురించి ఏమి చెప్పాలి? కాబట్టి, తాత్కాలికమైన మరియు సుఖంలేని ఈ ప్రపంచం లోకి వచ్చాక, ఇక, నా యందు భక్తి తో నిమగ్నమవ్వుము. (9.33) ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము మరియు నాకు ప్రణామములు అర్పించుము.  నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించిన పిదప నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు. (9.34)

10.   వ అధ్యాయము: విభూతి యోగము

శ్రీ భగవానుడు ఇలా పలికెను : నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము,  నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి నేను నీకు వాటికి తెలియపరుస్తాను.. (10.01)

సమస్త సృష్టికి మూలాధారం భగవంతుడే

దేవతలకు గానీ, మహర్షులకు గానీ నా మూల స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. (10.02) నేను జన్మరహితుడను మరియు ఆది మొదలు లేనివాడిని అని మరియు సర్వ లోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు,  వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడుతారు. (10.03) బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, దయ, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణ, సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు, భయము-ధైర్యము, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానము, కీర్తి-అపకీర్తి మొదలగు - మనుష్యులలో ఉండే గుణములలోని వివిధములైన వైవిధ్యములు నా నుండే జనించాయి. (10.04-05) సప్త ఋషులు, వారి పూర్వం నలుగురు మహాత్ములు, పద్నాలుగు మనువులు వీరందరూ నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే ఈ లోకం లోని సమస్త ప్రజలు అవతరించారు. (10.06)

నా మహిమలను మరియు దివ్య శక్తులను యదార్థముగా తెలిసినవారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ దారి లేదు. (10.07) నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానము.  నా వల్లనే అన్నీ కొనసాగుతున్నవి.  దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. (10.08) వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు.  ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు. (10.09)

భగవంతుడు ఆయన భక్తులకు దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు. (10.10) వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను. (10.11) అర్జునుడు ఇలా అన్నాడు:  నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన పవిత్రమొనర్చే వాడివి, నిత్యసనాతన భగవంతుడివి, ఆది పురుషుడివి, జన్మ రహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి.  మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటివారు ఇది చాటిచెప్పారు, ఇప్పుడు స్వయముగా నీవే నాకు ఈ విషయాన్ని చెబుతున్నావు. (10.12-13)

యదార్థ స్వరూపాన్ని ఎవరూ తెలుసుకోలేరు

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను ధృడ విశ్వాసంతో నమ్ముతున్నాను.  ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యదార్థ స్వరూపమును తెలుసుకోలేరు. (4.06 కూడా చూడండి) (10.14) ఓ కృష్ణా!  సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే! నిజానికి, నిన్ను నీవు మాత్రమే నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు. (10.15) నీవు సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉండే నీ దివ్య మహిమలను దయచేసి నాకు వివరించుము. (10.16) ఓ కృష్ణా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూఉండను?  ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను చింతన చేయగలను, ఓ భగవంతుడా? (10.17) మరల విస్తారముగా నీ దివ్య మహిమలను మరియు అవతారములను చెప్పుము, ఓ జనార్ధనా! నీ అమృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివితీరదు. (10.18)

పరమాత్మే ప్రతీ రూపము అవుతుంది

శ్రీ భగవానుడు పలికెను:  ఇప్పుడు నా దివ్య మహిమలను నీకు క్లుప్తంగా వివరిస్తాను, ఎందుకంటే వాటి వివరణకి అంతమే లేదు. (10.19) ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. (10.20) అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని; ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని.  మరుత్తులలో మరీచుడను మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను. (10.21) నేను వేదములలో సామ వేదమును, దేవతలలో ఇంద్రుడను. ఇంద్రియములలో మనస్సును; ప్రాణులలో చైతన్యమును. (10.22) రుద్రులలో నేను శంకరుడను; అసురులలో కుబేరుడను; వసువులలో అగ్నిని మరియు పర్వతాలలో మేరు పర్వతమును. (10.23) పురోహితులలో నేను బృహస్పతిని; సేనాపతులలో నేను కార్తికేయుడను; మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము. (10.24) మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన 'ఓం' కారమును. జపములలో  భగవన్నామమును మరలమరల జపించటమే నేను; స్థావరములలో హిమాలయమును నేను (10.25)

దైవ ఆవిర్భావములను గురించి క్లుప్త వివరణ

వృక్షములలో నేను రావి చెట్టును; దేవర్షులలో నారదుడను.  గంధర్వులలో చిత్రరథుడను, సిద్దులలో నేను కపిల మునిని. (10.26) గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన, ఉచ్చైఃశ్రవమున,  గజేంద్రములలో నేను ఐరావతమును మరియు మనుష్యులలో రాజును. ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును.  సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను మన్మథుడు నేనే; సర్పములలో వాసుకిని నేను. (10.27-28) నాగులలో నేను అనంతుడను; నీటిలో నివసించే వాటిలో వరుణుడను.  పితృగణములో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో నేను యమధర్మరాజును.  దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును నేనే, మృగములలో సింహమును మరియు పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము. (10.29-30) పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జంతువులలో మొసలిని, మరియు ప్రవహించే నదులలో గంగా నదిని. (10.31)

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము, అని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని, మరియు సంవాదములలో తర్కబద్ద నిర్ణయమును నేనే. (10.32) అక్షరములలో అ-కారమును; సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అపరిమితమైన కాలమును, మరియు సృష్టికర్తలలో బ్రహ్మను. (10.33) సర్వమునూ కబళించే మృత్యువును, నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తిస్థానమును.  స్త్రీ లక్షణములో నేను కీర్తిని, సిరిసంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపకశక్తిని, మేధస్సు, ధైర్యము మరియు క్షమాగుణమును. (10.34) సామ వేద మంత్రములలో నేనే బృహత్సామము అని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే.  హైందవ పంచాగము లో మార్గశీర్ష మాసమును, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువును నేనే.  (10.35) మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను మరియు సంకల్పము కలవారిలో ధృడసంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే. (10.36)

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడుని మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడను అని తెలుసుకొనుము మరియు గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను. (10.37) న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్దమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను.  రహస్యములలో నేను మౌనమును. జ్ఞానులలో జ్ఞానమును నేనే. (10.38) సర్వ భూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే, అర్జునా.  చరాచర ప్రాణి ఏదీ కూడా నేను లేకుండా ఉండదు. ( 7.10 మరియు 9.18 కూడా చూడండి) (10.39)

అనంతమైన సృష్టిలో తెలుసున్నది చిన్న భాగమే

నా దివ్య మహిమలకు అంతము లేదు,  నేను ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. (10.40) నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము. (10.41) ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా  ఒక్క చిన్న అంశ తోనే, సమస్త జగత్తు యందు వ్యాపించి దాన్ని పోషిస్తూ ఉన్నాను. (10.42)

11.  వ అధ్యాయము: విశ్వరూప సందర్శన యోగము.

అర్జునుడు పలికెను: నా మీద దయచే నీవు తెలియపరచిన ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తరువాత, నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. (11.01) సర్వ ప్రాణులు ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి వివరంగా నీ నుండి విన్నాను, ఓ కృష్టా,  నిత్య శాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను. (11.02)

అన్వేషకుడి అంతిమ లక్ష్యం భగవంతుని దర్శనం

ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు, నీవు సరిగ్గా అటువంటి దివ్య స్వరూపానివే.  ఇప్పుడు నాకు, నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. (11.03) ఓ యోగేశ్వరా, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే, దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన విశ్వ రూపమును నాకు చూపించుము. (11.04) శ్రీ భగవానుడు ఇలా పలికెను:  వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా  స్వరూపములను, ఇదిగో  చూడుము ఓ అర్జునా.  నాలో తిలకించు. పన్నెండు మంది  అదితి పుత్రులను, ఎనిమిది మంది వసువులను, పదకొండు రుద్రులను, ఇద్దరు అశ్వినీ కుమారులను, అంతే కాక, నలభైతొమ్మిది మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడని అద్భుతములను కూడా చూడు. ఒక్కచోటే కూడి ఉన్న సమస్త చరాచరములను కలిగిఉన్న జగత్తును, నా విశ్వ రూపము యందే దర్శించుము ఇప్పుడు ఓ అర్జునా. ఇంకా మరేదైనా చూడదలుచుకున్నా వాటన్నిటినీ నా విశ్వ రూపము యందే చూడుము. (11.05-07) కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ ప్రాకృతిక కళ్ళతో చూడలేవు. కాబట్టి, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా మహాద్భుత వైభవమును దర్శించుము. (11.08)

శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వ రూపాన్ని చూపిస్తాడు

సంజయుడు పలికెను:  ఓ మహారాజా, ఇట్లు పలికిన తర్వాత, ఆ యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు, తన దివ్యమైన మరియు వైభవోపేతమైన రూపమును అర్జునుడికి చూపెను. (11.09)   విశ్వ రూపములో, అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులను దర్శించాడు.  అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములను మరియు అనేక రకాల దివ్య ఆయుధములను కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరం పై అనేక మాలలను కలిగి ఉంది,  దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్నది.  మహాద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత్రా తన ముఖముతో తనను తాను వ్యక్తపరుచుకున్నాడు. (11.10-11) ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు. (11.12) అక్కడ, ఆ దేవదేవుని శరీరము యందు, సమస్త బ్రహ్మాండములన్నీ ఒక్క చోటే ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. (  13.16, మరియు 18.20 కూడా చూడండి) (11.13)

భగవంతుడిని చూడటానికి ఎవరూ సిద్ధంగా ఉండకపోవచ్చు లేదా అర్హత పొందలేకపోవచ్చు

అప్పుడు, పరామాశ్చర్యమునకు లోనయ్యి, రోమములు నిక్కబోడుచుకున్నవాడైన అర్జునుడు, చేతులు జోడించి తలవంచి నమస్కరిస్తూ, భగవంతుడుని ఈ విధంగా స్తుతించాడు (11.14) అర్జునుడు ఇలా చెప్పెను:  ఓ శ్రీ కృష్ణా! నీ శరీరము నందు నేను- సకల దేవతలనూ, ఎన్నెనో ప్రాణికోటి సమూహములను, కమలము యందు కూర్చుని ఉన్న బ్రహ్మ దేవుడిని, శివుడిని, అందరు ఋషులను, మరియు దివ్య సర్పములను- చూచుచున్నాను. (11.15) అనేకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వరా, విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆదిమధ్యాంతరములు చూడలేకున్నాను. (11.16) కిరీటముతో, చక్ర-గధ ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది. (11.17)

 నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము; నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు; నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. (11.18) నీవు ఆది-మధ్య-అంతము లేనివాడవు; నీ శక్తులు అపరిమితమైనవి.   నీకు అనంతమైన బాహువులు కలవు; సూర్యచంద్రులు నీ నేత్రములు వంటివి మరియు అగ్నినీ నోరు వంటిది.  సమస్త సృష్టిని నీ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజ పరుచుతున్నటువంటి, నిన్ను , నేను దర్శిస్తున్నాను. (11.19) దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు.  ఓ మహత్మా, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపమును దర్శిస్తూ, ముల్లోకములూ భయంతో వణికిపోవడం నేను గమనిస్తున్నాను. (11.20) దేవతలందరూ నీలో ప్రవేశిస్తూ నీ యొక్క ఆశ్రయం పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రములతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు. (11.21) రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు. ఓ మహా ప్రభూ, ఎన్నెన్నో నోర్లు, చేతులు, ఊరువులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పళ్ళతో ఉన్న నీ మహాద్భుతమైన స్వరూపము పట్ల పూజ్యభావంతో, సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితమైఉన్నాము. (11.22-23)

అర్జునుడు విశ్వ రూపం చూసి భయపడ్డాడు

హే విష్ణో- ఆకాశమును తాకుతూ, ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ, పెద్దగా తెరిచిఉన్న నోర్లతో, విశాలమైన అగ్ని గుండముల వంటి నీ కన్నులతో ఉన్న-  నీ స్వరూపమును చూస్తున్న నాకు, భయముతో గుండె అదిరిపొతున్నది. నేను ధైర్యమును మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను. (11.24) భయంకరమైన దంతములతో ఉన్న ఎన్నో నోర్లతో, ప్రళయ కాల సమయంలో కనిపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా, ఉన్న నిన్ను, చూసిన పిదప, నేను ఎక్కడున్నానో మరియు ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవ దేవా, నీవే జగత్తుకి ఆశ్రయము; దయ చేసి నామీద కృప చూపుము. (11.25) ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలక్రిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను. (11.26-27) ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్పగొప్ప యోధులు అందరూ నీ ప్రజ్వలించే ముఖముల లోనికి ప్రవేశిస్తున్నారు. (11.28) అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు. (11.29) నీ యొక్క భయంకరమైన నాలుకలతో ఎన్నెన్నో ప్రాణులను అన్ని దిక్కులా చప్పరించిపారేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో వారిని గ్రసించి వేస్తున్నావు.  హే విష్ణో! నీవు సమస్త జగత్తును నీ భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు. (11.30) నీవెవరో తెలియచేయుము.  ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికీ ముందే ఉన్న నీ గురించి, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను, ఎందుకంటే నీ స్వభావము మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను. (11.31)

మేము ఒక దైవిక పరికరం మాత్రమే

శ్రీ భగవానుడు ఇలా పలికెను: నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును.  నీ  ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు. (11.32) కాబట్టి, ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము, సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము.  ఈ యోధులు ఇంతకు పూర్వమే నా వలన సంహరింపబడి ఉన్నారు, కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు. (11.33) ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇంకా ఇంతర వీర యోధులు అందరూ నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు.  కాబట్టి, ఆందోళన పడకుండా వారిని అంతం చేయుము. కేవలం పోరాడు.  నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు. (11.34)

విశ్వ రూపానికి అర్జునుడి ప్రార్థనలు

సంజయుడు పలికెను : కృష్ణుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భయంతో వణికిపోయాడు.  చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను. (11.35) అర్జునుడు పలికెను : హే కృష్ణా!  సమస్త జగత్తు నిన్ను కీర్తించుచూ ఆనందహర్షములతో ఉన్నది, నీ పట్ల ప్రేమతో నిండిపొయినది. ఇది సముచితమే.  రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోవుతున్నారు మరియు ఎంతో మంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. (11.36) ఓ మహాత్మా, మూల సృష్టికర్త బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభూ, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త-అవ్యక్తములకూ అతీతమైన నాశనములేనివాడివి ( 9.19, మరియు 13.12 చూడండి) (11.37)

నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆది దేవుడవు; నీవే విశ్వమంతటికీ ఉన్న ఒకేఒక్క ఆధారము, ఆశ్రయము.   నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు.  నీవే పరంధాముడవు.  ఓ అనంతరూపా, నీవే సమస్త జగత్తుయందు వ్యాపించి ఉన్నవాడవు. (11.38) నీవే వాయుదేవుడవు, యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు మరియు చంద్రుడవు. నీవే సృష్టికర్త బ్రహ్మవు మరియు సర్వ భూతముల పితామహుడవు. నీకు నేను వేలసార్లు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను. (11.39) అనంతమైన శక్తిసామర్ధ్యములు కల ప్రభూ, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక ఉండి కూడా నమస్కరిస్తున్నాను, నిజానికి అన్ని వైపులనుండీ నమస్కరిస్తున్నాను! నీవు అనంతమైన సామర్ధ్యము, పరాక్రమము కలిగినవాడివై అన్నింటా వ్యాపించి ఉన్నావు, అందుకే సమస్తమూ నీ స్వరూపమే. (11.40)

నీవు నా మిత్రుడవు అనుకుంటూ, అతి చనువుతో నిన్ను, "ఓ కృష్ణా", "ఓ యాదవా", "ఓ నా ప్రియ మిత్రమా" అని పిలిచాను.  నీ మహిమ తెలియక, నిర్లక్షముగా, అతి చనువుతో ప్రవర్తించాను. (11.41) ఆడుతున్నప్పుడు కానీ, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఏకాంతముగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల హాస్యానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే, దానికి నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. (11.42) నీవే సమస్త విశ్వమునకు, చరాచర ప్రాణులన్నిటికీ తండ్రివి. నీవే సర్వశ్రేష్ఠమైన ఆరాధ్య యోగ్యుడవు,  సర్వోత్కృష్ట ఆధ్యాత్మిక గురుడవు.  ఓ అసమానమైన శక్తి కలిగినవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు, నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? (11.43)

అందుకే ఓ ప్రభూ, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామం అర్పిస్తూ, నీ కృప వేడుకుంటున్నాను.  ఒక తండ్రి కొడుకుని సహించినట్టుగా, ఒక మిత్రుడు తన మిత్రుడిని క్షమించినట్టుగా, ప్రేమించినవారిని ప్రేమికుడు మన్నించినట్టుగా, దయచేసి నా అపరాధములను మన్నింపుము. (11.44) ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే, నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కరుణ చూపుము, తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము, ఓ దేవ దేవా! (11.45)

భగవంతుడిని ఏ రూపంలోనైనా చూడవచ్చు

ఓ వెయ్యి చేతులు కలవాడా, నీవే మూర్తీభవించిన విశ్వము అయినా, నిన్ను, కిరీటము ధరించి, చక్రమును, గదను కలిగిఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములో చూడగోరుతున్నాను. (11.46) శ్రీ భగవానుడు పలికెను : అర్జునా, నీ చేత ప్రసన్నుడనై, నా యోగమాయా శక్తి ద్వారా, నా యొక్క తేజోవంతమయిన, అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వ రూపమును నేను నీకు చూపించితిని. నీ కంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. (11.47) వేదముల అధ్యయనం వలన కానీ, యజ్ఞయాగాదులు చేయటం వలన కానీ, తపస్సులు, దానాల వలన కానీ, తీవ్ర నియమనిష్ఠ లను ఆచరించటం వలన కానీ, ఏ మానవుడు కూడా నీవు చూసిన దాన్ని ఇప్పటివరకు చూడలేదు. (11.48)

నా యొక్క ఆ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్నచిత్తముతో మరొకసారి నా యొక్క వ్యక్తిగత రూపమును చూడుము. (11.49) సంజయుడు ఇలా పలికెను: ఈ విధముగా పలికిన తరువాత దయాళువైన  శ్రీ కృష్ణుడు తన చతుర్భుజ సాకార రూపమును మరల చూపించెను. తదుపరి, సౌమ్యమైన రెండు భుజముల రూపమును స్వీకరించి, భయపడిన అర్జునుడిని మరింత శాంతింపచేసెను. (11.50)  అర్జునుడు ఇలా అన్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీ  సౌమ్యమైన రెండు చేతుల మనుష్య రూపము చూసి, నా ప్రశాంతతను మళ్ళీ పొందాను మరియు నా మనస్సు సహజ స్థితికి వచ్చినది. (11.51)

భక్తి ప్రేమ ద్వారా భగవంతుడిని చూడవచ్చు

శ్రీ భగవానుడు పలికెను: నీవు చూసే నా ఈ రూపము దర్శనం పొందటం ఎంతో దుర్లభమయినది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. (11.52) వేదాధ్యయనము వలన కానీ, తపస్సులవలన కానీ, దానధర్మాల వలన కానీ లేదా యజ్ఞముల వలన కానీ, నేను, నీవు ఇంతకు ముందు చూసినట్టుగా కనిపించను. (11.53) ఓ అర్జునా, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ ముందే నిల్చుని ఉన్న నన్నుగా యదార్ధముగా తెలుసుకోబడుతాను.  అందువలన నా దివ్య దృష్టిని పొందిన తరువాత నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు. (11.54) ఎవరైతే అన్ని కర్మలనూ నా కోసమే చేస్తారో, నా పైనే ఆధారపడతారో, నా పట్ల భక్తితో ఉంటారో, మమకారాసక్తులు లేకాండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధభావము లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్నే చేరుకుంటారు. ( 8.22 కూడా చూడండి) (11.55)

12.  వ అధ్యాయయు: భక్తి యోగము

సాకార రూపము లేదా నిరాకార బ్రహ్మాన్ని దేనిని ఆరాధించాలి?

అర్జునుడు ఇలా అడిగెను:  ఎల్లప్పుడూ నీ  సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మం ను ఉపాసించే వారు - ఈ రెండు రకాల వారిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? (12.01) శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు నిరంతరమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తి లో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. (6.47 కూడా చూడండి) (12.02) నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకర తత్త్వాన్ని-ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధి తో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు. (12.03-04)

భగవంతుని సాకార (వ్యక్తిగత) రూపాన్ని ఆరాధించడానికి కారణాలు

మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది. (12.05) కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది. (12.06-07)

భగవంతుని చేరేందుకు నాలుగు మార్గాలు

నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు.   దీనిపై ఎలాంటి సంశయము వద్దు. (12.08) ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేక పోతే, ఓ అర్జునా, మనస్సును ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ, నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము. (12.09) నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు. (ఒక సాధనంగా, స్వార్థపూరిత ఉద్దేశ్యాలు లేకుండా, నాకు సేవ చేయడానికి మరియు నన్ను ప్రసన్నం చేయడానికి). (9.27, మరియు 18.46 కూడా చూడండి) (12.10) ఒకవేళ నీవు నా కొరకై భక్తి తో పని చేయుట చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము. (12.11)

కర్మయోగము చాలా ఉత్తమమైనది

యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది; జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది.   ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మంచిది, ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును. (  మరిన్ని త్యాగాల గురించి 18.02, 18.09 చూడండి ) (12.12)

భక్తుడి లక్షణాలు

ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు.  వారు ఆస్తి/ధనము పై మమకార రహితముగా ఉంటారు, అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు, అంతేకాకుండా ఎల్లప్పుడూ మించే మనస్సుతో ఉంటారు.    వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, ధృడ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. (12.13-14) లోకమున ఎవ్వరినీ బాధ పెట్టని వాడు, ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. (12.15) ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్య-ఆంతరములో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్ధచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు. (12.16) ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు. (12.17) ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖః ముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యము ను విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు. (12.18-19)

దైవిక లక్షణాలను పెంపొందించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించాలి

ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.

13.  వ అధ్యయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

సృష్టి సిద్ధాంతం

అర్జునుడు ఇలా అన్నాడు, "ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నిజమైన జ్ఞాను, అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి? అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. (13.01) శ్రీభగవానుడు ఇలా పలికెను: అర్జునా!  ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన దానిని క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటిని గురించి తెలిసిన ఋషులచే చెప్పబడింది. నేను కూడా ప్రతీ క్షేత్రమునూ బాగా తెలిసిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమనీ (కార్యకలాపాలు జరిగే ప్రదేశం) మరియు ఆత్మ, పరమాత్మ క్షేత్రజ్ఞులని (క్షేత్రమును తెలిసినవారు) తెలుసుకోవడమే, నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను (13.03) క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడిందో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్ధ్యము ఏమిటో కూడా వివరిస్తాను. (13.04) మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును అనేక విధములుగా వివరించి ఉన్నారు. ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది,  ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు  ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ క్షేత్రము ఉన్నది. (7.04 కూడా చూడండి) (13.05-06)

మోక్ష  సాధనంగా నాలుగు విధాల దివ్యమైన సత్యం

 కోరిక మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు అనబడతాయి.  నమ్రత; దంభము (కృత్రిమ బుద్ధి) లేకుండా ఉండుట: అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి; మరియు ఆత్మ నిగ్రహము , ఇంద్రియ భోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; (13.07-08) మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని గురించి యావ లేకుండా ఉండటం, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్వాన్వేషణ, వీటన్నింటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, అంతేకాకుండా వీటికి వ్యతిరేకమైన వాటిని అజ్ఞానము అని అంటాను (13.09-12)

భగవంతుడిని నీతికథల ద్వారా వర్ణించవచ్చు తప్ప వేరే విధంగా కాదు

ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, నీకు దానిని ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మాం. (9.19, 11.37, మరియు 15.18 కూడా చూడండి) (13.13) సర్వత్రా ఆయన పాదములు, కన్నులు, శిరస్సులు మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్న చోట్లా ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి దాక్కుని ఉన్నాడు. (13.14) ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన తెలుసుకొనగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధములు లేవు అయిన ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు. ఆయన ఏ గుణములు లేనివాడు అయినా  ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే. (13.15) ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. సూక్ష్మమైన వాడు,  కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంలో ఉన్నాడు కానీ చాలా దగ్గరలో ఉన్నాడు కూడా!. (13.15) ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే సమస్త ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు,  లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము. (11.13, మరియు 18.20 కూడా చూడండి) (13.17)

అన్ని తేజోమయవస్తువుల్లో ఆయనే ప్రకాశానికి మూలము, మరియు అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు, జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయమూ ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యమూ ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో ఉంటాడు.  (15.06 మరియు 15.12 కూడా చూడండి) (13.18) ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలిపాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్ధముగా అర్ధం చేసుకోగలరు, అలా చేసిన తర్వాత, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు. (13.19)

పరమాత్మ, ఆత్మ, భౌతిక స్వభావం మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క వివరణ

ప్రకృతి మరియు పురుషుడు రెండూ కూడా సనాతనమైనవి. శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణాలూ కూడా,  భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.  సృష్టిలో కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మ యే బాధ్యుడు అని చెప్పబడినది. (13.20-21) ఎప్పుడైతే ప్రకృతిలో స్థితమై ఉన్న పురుషుడు త్రిగుణాలను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే,  జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును. (13.22)

దేహములోనే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి,  సర్వ నియామకుడు, పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట అధికారి మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు. (13.23) పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్ధమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక్కడ పుట్టరు. వారి ప్రస్థుల పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. (13.24) కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. (13.25)

విశ్వాసం మాత్రమే నిర్వాణానికి దారితీస్తుంది

ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి వేరే వారి దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయడం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు.  (13.26) అర్జునా! నీవు ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క కలయిక వలననే ఉన్నాయని సమస్త ప్రాణులలో వాటి ఆత్మ తో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు. (13.28)

సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మ గా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. అందువల్ల వారు పరమపదానికి చేరుకుంటారు. (13.29)  శరీరము యొక్క అన్ని పనులూ చేసేది భౌతిక ప్రకృతియే. జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు అని అర్ధం చేసుకున్నవాడు నిజముగా చూసినట్లు లెక్క. ( 3.27, 5.09,మరియు 14.19 కూడా చూడండి) (13.30) విభిన్న వైధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.. (13.31)

ఆత్మ లక్షణాలు

ఓ అర్జునా! పరమాత్మ నాశములేనివాడు, అనాదియైనవాడు, భౌతిక లక్షణములు ఏవీ లేనివాడు. దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు. (13.32) ఆకాశము అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది. కానీ  సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితము కాదు. అదేవిధంగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు. (13.33) లాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మ యే మొత్తం శరీరమును చైతన్యంతో ప్రకాశింపచేయును. (13.34) జ్ఞాన నేత్రాలచే ఈ క్షేత్రము మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్దతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు. (13.35)

14.  వ అధ్యయము: గుణ త్రయ విభాగ యోగము

శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్లీ ఒకసారి ఈ సర్వశ్రేష్ట విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన  జ్ఞానమును నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. (14.01) ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు, సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. (14.02)

అన్ని జీవులు ఆత్మ మరియు ప్రకృతి యొక్క సంయోగం నుండి జన్మిస్తాయి

సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశింపచేస్తాను.  ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. (9.10 కూడా చూడండి) (14.03) పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతి యే గర్భము మరియు బీజమును ఇచ్చే తండ్రిని నేనే. (14.04)

భౌతిక స్వభావం యొక్క త్రిగుణములు ఆత్మను శరీరానికి ఎలా బంధిస్తాయి

  అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది సత్వ గుణము, రజోగుణము, తమో గుణము. ఈ గుణములే నాశనము లేని నిత్య జీవాత్మను నాశనమయ్యే దేహాన్ని బంధిస్తాయి. (14.05) వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది, ఇది ప్రకాశమైనది మరియు చాలా క్షేమదాయకమైనది.  జ్ఞానము మరియు సుఖానుభవము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది. (14.06) ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తి తో కూడినది. అది ప్రాపంచిక  కోరికలు మరియు అనురాగముల వలన జనిస్తుంది మరియు ఆత్మను కామ్య కర్మల పట్ల ఆసక్తి చే బంధించివేస్తుంది. (14.07) ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రలచే భ్రమకు గురి చేస్తుంది. (14.08) సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము జీవాత్మను కర్మల పట్ల ఆసక్తి పరుస్తుంది; మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతి కి బంధించివేస్తుంది. (14.09)

ప్రకృతి యొక్క త్రిగుణాల లక్షణాలు

ఒక్కోసారి రజోగుణము, తమోగుణములపై సత్త్వముది పైచేయిగా, ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది. (14.10) దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వ గుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము.  (14.11) రజో గుణము ప్రబలినప్పుడు, లోభము, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. (14.12) ఓ అర్జునా అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు. (14.13)

వ్యక్తి ఆత్మల  పరకాయ ప్రవేశం కోసం త్రిగుణాలు వాహకాలుగా ఉంటాయి

సత్త్వ గుణ ప్రధానముగా ఉండి మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజోతమోగుణాలు లేనటువంటివి) చేరుకుంటారు. (14.14) రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు పనులతో ప్రేరణ పొందేవారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉండి మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు. (14.15) సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజోగుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి (14.16) సత్త్వ గుణముచే జ్ఞానము, రజో గుణముచే లోభము, మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము పుడతాయి. (14.17) సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఊర్ధ్వలోకాలకు వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యలోనే ఉండిపోతారు,  తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలైతారు. (14.18)

భౌతిక స్వభావం త్రిగుణాలను  దాటిన తర్వాత నిర్వాణాన్ని పొందండి

అన్ని పనులలో,  చేసేది ఈ  త్రిగుణములే, ఇతర వేరే ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, మరియు నేను వీటికి అతీతమైనవాడను అని తెలుసుకుంటారో వారు నా దివ్యస్వభావాన్ని పొందుతారు.  (3.27, 5.09, మరియు 13.29 కూడా చూడండి) (14.19) దేహ సంబంధమయిన ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, వ్యాధి, మృత్యువు, వృద్ధాప్యముల దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు. (14.20)

త్రిగుణాలకు అతీతంగా ఉండే విధానం

అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతిలో ఉన్న త్రిగుణములకు అతీతముగా ఉన్నవాడి లక్షణములు ఎలా ఉంటాయి కృష్ణా? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణ బంధనాలకి ఎలా అతీతంగా ఉంటారు? శ్రీ భగవానుడు పలికెను:  ఈ త్రిగుణములకు అతీతులుగా ఉన్నవారు సత్వగుణమైన ప్రకాశము కానీ, రజోగుణమైన కార్యకలాపములు కానీ, లేదా తమోగుణమైన మోహభ్రాంతిని కానీ అవి పుష్కలంగా ఉన్నపుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్ధంగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలంగా ఆత్మయందే స్థితమై ఉంటారు. (4.22-23) సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు వీరు త్రిగుణములకు అతీతులైన వారు అని చెప్పబడతారు. (14.24-25)

నిష్కల్మష భక్తి ద్వారా త్రిగుణాలకు అతీతులవగలరు

నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై  పోవుదురు మరియు బ్రహ్మం స్థాయికి చేరుతారు. ( 7.14 మరియు 15.19 కూడా చూడండి) (14.26) సనాతనమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మామునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారము. (14.27)

15.  వ అధ్యాయము: పురుషోత్తమ యోగము

సృష్టి అనేది మాయ శక్తులచే సృష్టించబడిన చెట్టు లాంటిది

శ్రీ భగవానుడు పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన  అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని ఆకులు వేదమంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు. (10.08 కూడా చూడండి) (15.01) త్రిగుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుళ్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించడానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్ళాడుతూ ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించడానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేళ్లాడుతూ ఉంటాయి. క్రింద, దాని  వేర్లు శాఖలుగా విస్తరించి, మానవ లోకములో కర్మలను కలుగచేస్తాయి. (15.02)

బంధమనే చెట్టును ఏవిధంగా నరికి మోక్షాన్ని పొందాలి

ఈ వృక్షము నిజ స్వరూపము ఈ జగత్తులో తెలియబడదు, దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్థిత్వము కూడా అర్థం కాదు. కానీ, లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును వైరాగ్యమనే బలమైన గొడ్డలితో నరికేయాలి. ఆ తర్వాత ఆ వృక్షము మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం నుండి సంభవిస్తోంది. ఆయనను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనం ఈ జగత్తులోకి రాము. (3-04) దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తిని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతన లోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వందములకు అతీతులై ఉన్నవారు ఇటువంటి ముక్తిపొందిన జీవులు నా పరమపదమును చేరుకుంటారు. (15.05) సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన తర్వాత మానవులు మళ్లీ ఈ భౌతికమైన లోకానికి తిరిగిరారు. ( 13.17 మరియు 15.12 కూడా చూడండి) (15.06)

జీవాత్మ ఆనందం

భౌతిక జగత్తులోఉన్న జీవాత్మలు నా సనాతనమైన అంశలే.  కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు. (15.07) ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది. (2.13 కూడా చూడండి) (15.08) మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు చెవులు, కళ్లు, చర్మము,నాలుక మరియు ముక్కు -  వీటి గ్రహణ శక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తు విషయాలను ఆస్వాదిస్తుంటుంది. జీవాత్మను, అది ఇంద్రియ వస్తువిషయములను  ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దర్శించగలరు. (15.09-10) గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు. (15.11)

సర్వస్వం యొక్క సారాంశం ఆత్మే

సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని ప్రకాశము మరియు అగ్ని కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకో.(13.17 మరియు 15.06 కూడా చూడండి) (15.12) పృథ్వి మీద అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తిచే   సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను. (15.13) నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. (15.14) నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు మర్చిపోవడం కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదార్ధమును తెలిసినవాడను నేనే. (6.39 కూడా చూడండి) (15.15)

పరమాత్మ, ఆత్మ మరియు సృష్టించిన జీవులు ఏమిటి?

సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి. నశించేవి మరియు నాశనము లేనివి. భౌతిక ప్రపంచంలో ఉన్నవి నశించేవి. నాశనము లేనివి అంటే మోక్షము పొందిన జీవులు. (15.16) ఇవే కాక, నాశరహితమైన పరమాత్మ అయిన, ఆ పురుషోత్తముడు, ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకాలలో ప్రవేశించి,  సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. (15.17) నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్ధముకంటెనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటెనూ కూడా కూడా అతీతమైన వాడను. అందువల్ల వేదాలలోనూ, స్మృతులలోనూ నేనే సర్వత్రా దివ్యపురుషుడిగా కీర్తించబడ్డాను. (15.18) ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్లు, వారు హృదయంపూర్వకంగా నా భజనే చేస్తారు. ( 7.14, 14.26, మరియు 18.66 కూడా చూడండి) (15.19) అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్ధం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు,  అంతేకాకుండా సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు. (15.20)

16.  వ అధ్యాయము: దైవాసుర సంపద్విభాగ యోగము

మోక్షసాధన కోసం దైవీ సంపద కలవాని లక్షణాలు

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా! దైవీ సంవద కలవాని లక్షణములు ఇవి నిర్భయత్వము, కల్మషం తేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంధ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణుకువ మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట మరియు డాంభికము లేకుండుట. (16.01-03)

వదిలివేయవలసిన దెయ్యాల లక్షణాల జాబితా

ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కల వారి గుణములు. (16.04) దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమవుతాయి. బాధపడకు, నీవు దైవీ గుణములతోనే జన్మించావు. (16.05)

మానవులలో రెండు రకాలు మాత్రమే ఉన్నారు: జ్ఞానులు మరియు అజ్ఞానులు

ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు దైవీ గుణములు కలిగిన వారు మరియు అసురీ స్వభావు కలిగినవారు. నేను దైవీ గుణముల గురించి పూర్తిగా వివరించాను నీకు, ఇప్పుడు ఆసురీ స్వభావమును గురించి చెప్తాను విను. (6.06) అసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్ధం చేసుకోరు. అందుకే వారు పవిత్ర కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కానీ కలిగి ఉండరు.(6.07) వారు ఇలా అంటారు, "ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు,ఏ రకమైన ఆధారము లేదు, భగవంతుడు అనేవవాడు ఎవరూ లేరు, ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఏర్పడింది, లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు.’’ అని.   (16.08) ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో కౄర కార్యములతో, ప్రపంచానికి  శత్రువులుగా మారి దానిని విధ్వసం చేయభయపెడుతారు. (16.09) విపరీత కామము, దంభము, దురభిమానము తో నిండి,  గర్వము మరియు అహంకారంతో, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర బుద్ధితో ప్రవర్తిస్తారు. (16.10) వారు అంతులేని బాధలు, ఆందోళనలు చివరికి మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. (16.11)

వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి, మరియు కామ క్రోధములచే ఆవరించబడి, వారు అన్యాయ పద్దతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు,  ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే. (16.12) రాక్షస లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, "నేను ఇప్పటికే చాలా ధనమును సంపాదించాను,  నా కోరికలను తీర్చుకుంటాను.ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా ఉంటుది. ఆ శత్రువు నా వల్లనే నాశనం అయ్యాడు. నేను అలాగే మిగిలిన వారిని కూడా నాశనం చేయగలను. (16.13)  నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే దీనినంతా అనుభవించేది, నేను చాలా శక్తివంతుడను, నేను సుఖంగా ఉన్నాను. (16.14) నేను ధనవంతుడను మరియు నా బంధువులు గొప్ప హోదాలో  ఉన్నారు. నాకు సాటి ఎవరూ లేరు. నేను యజ్ఞములు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను.’’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే మోహితులై పోతారు. (16.15) ఇటువంటి ఊహలు, తలపులతో తప్పుదారి పట్టి, మోహమనే వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియములను తృప్తి పరచటానికకే బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు. (16.16)  ఇటువంటి స్వార్ధ  చింతనతో ఉన్న మూర్ఖపు మానవులు, తమ సంపద, ధనముచే గర్వము, అహంకారముతో నిండి,  శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు. (16.17) అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకు పోయి, ఈ రాక్షస ప్రవృత్తి కలవారు, తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను ద్వేషిస్తూ ఉంటారు.  (16.18)

బాధ అనేది అజ్ఞానుల విధి

కౄరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో,  పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. (16.19) ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే పుడుతూ ఉంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి. (16.20)

మూడు నరక ద్వారములు - కామము, క్రోధము, లోభము.

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి, అవి కామము, క్రోధము, లోభము. కాబట్టి  అందరూ వీటిని విడిచిపెట్టాలి. (16.21) చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా  వారు  పరమ లక్ష్యమును పొందుతారు. (16.22)

శాస్త్రాలను ప్రమాణంగా తీసుకోవాలి

ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని  కానీ, సుఖానందమును కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు. (16.23) కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము, అదే విధంగా ఈ ప్రపంచంలో ప్రవర్తించు. (16.24)

17.  వ అధ్యయము: శ్రద్ధా త్రయ విభాగ యోగము

అర్జునుడు ఇలా అన్నాడు : ఓ కృష్ణా, శాస్త్ర విధులను త్యజించినా,  శ్రద్ధావిశ్వాసములతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? వారి యొక్క విశ్వాసము సత్త్వ గుణం లో ఉంటుందా లేదా రజో, తమో గుణములలో ఉంటుందా? (17.01)

మూడు  రకాల విశ్వాసాలు

శ్రీ భగవానుడు ఇలా పలికెను : ప్రతి ఒక్క మానవుడు తన సహజసిద్ధ విశ్వాసముతో జన్మిస్తాడు, ఇది మూడు రకాలుగా సాత్వికము, రాజసము, లేదా తామసము గా ఉండవచ్చును. ఇప్పుడు ఇక ఈ విషయంపై నానుండి వినుము (17.02) అందరు మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధావిశ్వాసములను కలిగి ఉంటారు. అందరికీ శ్రద్ధా విశ్వాసములు ఉంటాయి, మరియు  వారి విశ్వాసము ఎట్టిదో అదే వారి వ్యక్తిత్వముగా ఉంటుంది. (17.03) సత్త్వ గుణములో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు; రజోగుణములో ఉండేవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు; తమో గుణములో ఉండేవారు భూత ప్రేతములను ఆరాధిస్తారు. (17.04) కొంతమంది జనులు, అత్యంత కఠినమైన తపస్సులను, శాస్త్రవిరుద్ధమైనా, తమ దంభం (కపటత్వం) మరియు అహంకారంచే ప్రేరితులై చేస్తారు. కామము మరియు మమకారముచే ప్రేరితులై, వారు తమ శరీర అవయములనే కాక, వారి శరీరములోనే పరమాత్మగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడతారు. ఇటువంటి బుద్దిహీనులు ఆసురీ గుణ సంకల్పంతో ఉన్నవారని తెలుసుకొనుము. (17.05-06)

మూడు రకాల ఆహారాలు

వ్యక్తులు ఇష్టపడే ఆహారము వారి వారి స్వభావానుసారం ఉంటుంది. యజ్ఞములు, తపస్సు, మరియు దానములు కూడా వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి. ఇప్పుడిక ఈ బేధములను గురించి విను. (17.07) సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి. (17.08) అతి చేదుగా, అతి పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, ఘాటుగా, ఎండిపోయిన మరియు కారంగా ఉన్న ఆహార పదార్ధములు రజో గుణ ప్రధానముగా ఉండే వారికి ఇష్టముగా ఉంటాయి. ఇటువంటి ఆహారములు బాధను, శోకమును మరియి వ్యాధులను కలుగ చేస్తాయి. (17.09) ఎండిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియంగా ఉంటాయి. (17.10)

మూడు రకాల త్యాగాలు

ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో ధృఢ సంకల్పము తో, చేసిన యజ్ఞము సత్త్వ గుణము తో చేయబడినట్టు (17.11) , అర్జునా, ప్రాపంచిక లాభము కోసము లేదా అహంకారముతో చేయబడిన యజ్ఞము, రజోగుణములో ఉన్నట్టు తెలుసుకొనుము. (17.12) శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాల విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నది అని పరిగణించబడును. (17.13)

వాక్కు సంబంధమైన తపస్సు

పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడుతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడును. (17.14) ఉద్వేగమును కలిగించని మాటలు, సత్యములు, కోపము పుట్టించనివి, ప్రియ హితమైనవి మరియు నిత్య వేద శాస్త్రముల పఠనము ఇవి వాక్కుసంధమైన తపస్సు అని చెప్పబడుచున్నది. (17.15) ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు భావములో పవిత్రత ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పేర్కొనబడ్డాయి.  (17.16)

మూడు రకాల తపస్సులు

భక్తి శ్రద్ధలు కల వ్యక్తులు అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులను, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులు అని అంటారు. (17.17) కీర్తిప్రతిష్టలు, గౌరవము, మరియు గొప్పల కోసం, ఆడంబరంగా చేసే తపస్సు రజో గుణములో ఉన్నట్లు. దాని యొక్క ప్రయోజనములు అస్ధిరమైనవి, మరియు తాత్కాలికమైనవి. (17.18) అయోమయ భావాలతో, తమని తామే హింసపెట్టుకుని లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది. (17.19)

మూడు రకాల దానాలు

దానము చేయుట కర్తవ్యము అని భావించి, తగిన అర్హత ఉన్నవాడికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది. (17.20) అయిష్టముగా ఇవ్వబడిన దానము, ఎదో తిరిగి వస్తుందనే ఆశతో లేదా ప్రతిఫలము ఆశించి ఇవ్వబడిన దానము రజో గుణములో ఉన్నదని చెప్పబడినది. (17.21) అనుచిత ప్రదేశంలో, సరికాని సమయంలో, అర్హతలేనివారికి (అపాత్రులకు), మర్యాద చూపకుండా, లేదా చులకనగా ఇవ్వబడిన దానము, తామస దానము గా పరిగణించబడుతుంది. (17.22)

పరబ్రహ్మమునకు సూచిక పదాలు

"ఓం తత్ సత్’’ అన్న పదములు, సృష్టి మొదలు నుండి, పరబ్రహ్మమునకు సూచికగా నిర్దేశించబడినవి.  వాటి నుండే పురోహితులు, శాస్త్రములు మరియు యజ్ఞములు ఏర్పడినవి. (17.23) కాబట్టి, యజ్ఞములు చేయటంలో, దానము ఇవ్వటంలో, తపస్సులు ఆచరించటం లో - వేద విదులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ, ఎల్లప్పుడూ 'ఓం' అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు. (17.24) ప్రతిఫలములను ఆశించని వారు, కానీ, ఈ భౌతిక బంధనముల నుండి విముక్తి పొందటానికి ప్రయిత్నించే వారు, తపస్సు, యజ్ఞము, మరియు దానము చేసేటప్పుడు ‘‘తత్’’ అనే పదము వాడబడుతుంది. (17.25) "సత్’’ అన్న పదానికి అర్ధం సనాతనమైన అస్థిత్వము మరియు మంగళప్రదము అని. ఓ అర్జునా, అది  శుభప్రదమైన కార్యమును సూచించటానికి కూడా వాడబడుతుంది.  (17.26) యజ్ఞము, తపస్సు, మరియు దానములు ఆచరించుటలో నిమగ్నమవ్వటాన్ని కూడా ఈ ‘‘సత్’’ అన్న పదం వివరిస్తుంది. కావున, ఈ ప్రయోజనము తో ఉన్న ఏ పని అయినా ‘‘సత్’’ అనబడుతుంది. (17.27) ఓ అర్జునా!  అశ్రద్దతో చేయబడిన దానములు కానీ, యజ్ఞములు కానీ ‘‘అసత్’’ అని చెప్పబడును. అవి ఈ లోకమున కానీ పరలోకమున కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. (17.28)

18.  వ అధ్యాయము: . మోక్ష సన్యాస యోగము

అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! 'సన్యాసము' (కర్మలను త్యజించడం) మరియు త్యాగము’ (కర్మఫలములను అనుభవించాలనే కోరికను వదిలేయడం) ల స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను.  వాటి మధ్య తేడాని కూడా తెలుసుకోవాలని కోరికగా ఉన్నది (18.01)

సన్యసించడం మరియు త్యజించడం నిర్వచనం

శ్రీ భగవానుడు ఇలా పలికెను: కోరికలచే ఉద్దేశించబడిన కర్మలను త్యజించడమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు.  సమస్త కర్మల ఫలములను విడిచి పెట్టడమే పండితులు త్యాగము అని అన్నారు. ( 5.01, 5.05, మరియు  6.01 కూడా చూడండడి) (18.02) కొంతమంది జ్ఞానసంపన్నులు అన్ని రకముల కర్మలను దోషభూయిష్టమైనవి అని వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞము, దానము మరియు తపస్సు లను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు. (18.03)

త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, త్యాగము అనేది మూడు విధములుగా ఉంటుంది. (18.04) యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి. (18.05) ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్కోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా.  (18.06)

మూడు రకాలైన త్యాగాలు

విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడింది. (18.07) విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ మంచిది కాదు మరియు మన ఉన్నతికి తోడ్పడదు. (18.08) అర్జునా, కర్తవ్యమునకు అనుగుణముగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు. (18.09) నచ్చని పనులు తప్పించుకోటానికి ప్రయత్నించకుండా లేదా ఇష్టమైన పనులకోసం ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగులు. వారు సత్వగుణ సంపన్నులు ఎటువంటి సంశయములు లేనివారు. (18.10) దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడును. (8.11) స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా, - సుఖము, దుఃఖము మరియు ఈ రెంటి మిశ్రమము ఈ మూడు విధాలుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ,  కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు. (18.12)

కర్మ యొక్క ఐదు కారకాలు

ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది. శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.(18.13-14) శరీరము, వాక్కు, మనస్సులచే ఏ కర్మ జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. (18.15) ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధితో ఉన్న అటువంటివారు యదార్ధమును గ్రహింపలేరు. (18.16) కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అనే భావన) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు. (18.17) జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును తెలిసినవాడు ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కరణము, క్రియ, కర్త, - ఈ మూడు కర్మ యొక్క అంగములు.. (18.18)

మూడు రకాల జ్ఞానాలు

జ్ఞానము, కర్మ, మరియు కర్త ఇవి ప్రకృతి త్రి-గుణముల పరంగా ఒక్కక్కటీ మూడు రకాలుగా ఉంటాయని సాఖ్య శాస్త్రము పేర్కొంటుంది.  నేను ఈ తేడాలను నీకు చెప్తాను, విను. (11.13, మరియు 13.16 కూడా చూడండి) (18.20) ఏ జ్ఞానము చేతనయితే భిన్నభిన్న దేహములలో ఉన్న వివిధ రకముల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.(18.21) సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది. (18.22)

మూడు రకాల కర్మలు

ఏదైతే కర్మ శాస్త్రబద్దముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో,  ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది. (18.23) స్వార్ధ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును. (18.24) మోహభ్రాంతి వల్ల ప్రారంభించి,  తమ స్వశక్తి ఏమిటో తెలుసుకోకుండా మరియు పరిణామాలు, జరిగే నష్టము మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు. (18.25)

మూడు రకాల కర్తలు

అహంకారము మరియు సంగ రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, ధృడసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు. (18.26) కర్మఫలముల పట్ల ఆసక్తి తో ఉంటూ, దురాశగలవాడై, హింసా ప్రవృత్తి కలిగి, అపవిత్రతో ఉండి, సంతోషము దు:ఖములచే ప్రభావితమవుచూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్లు పరిగణించబడతాడు. (18.27) క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్దకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలయాపన చేసేవారిని తమోగుణ కర్తలు అనవచ్చును. (18.28)

మూడు రకాల బుద్ధులు

ఇప్పుడు వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను. (18.29) ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును. (18.30) ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి రజోగుణములో ఉన్నట్టు. (18.31) చీకటితో ఆవృత్తమై, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. (18.32)

మూడు రకాల సంకల్పాలు మరియు మానవ జీవితంలోని నాలుగు లక్ష్యాలు

యోగము ద్వారా పెంపొందించుకున్న ధృడ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు. (18.33) ఫలాపేక్షచే ప్రేరితమై దర్మము (విధులు), కామము (సుఖములు) మరియు అర్థము (సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అనిచెప్పబడును. (18.34) విడువకుండా, పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనవుతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ది సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు. (18.35)

మూడు రకాల ఆనందాలు

ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి. (18.36) మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతం లాగా ఉండే సుఖమే సత్త్వ గుణసుఖము. అది ఆత్మజ్ఞానం యందే స్ధితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. (18.37) ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక(రజోగుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది. ( 5.22 కూడా చూడండి) (18.38) ఏదయితే ఆనందము, ఆత్మ యొక్క అస్థిత్వమును పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, నిద్ర, సోమరితనము, నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో అది తామసిక ఆనందము అని చెప్పబడును.   (18.39) ఈ భౌతిక జగత్తు నందు భూమిపై కానీ, లేదా ఊర్ధ్వస్వర్గాది లోకాలలో కానీ ఏ ప్రాణీ కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు. (18.40)

సామర్ధ్యం ఆధారంగా వృత్తులు విభజించబడ్డాయి

బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు--- వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడ్డాయి (పుట్టుక పరంగా కాదు) (4.13 కూడా చూడండి) (18.41)  శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్చత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞాను, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణులు సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు. (18.42) శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్ధ్యము ఇవి క్షత్రియులకు సహజంగగా ఉన్న కర్మ లక్షణములు.(18.43) వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజసిద్దమైన పనులు. పనులు చేయడం ద్వారా సేవ చేయడం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి (18.44)

విధి, క్రమశిక్షణ మరియు భక్తి ద్వారా మోక్షాన్ని పొందడం

స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధించబడిన విధులను ఆచరిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.(18.45) తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి---సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో--- వానిని ఆరాధంచిట్లు. ఇటువంటి పనులు చేయడం ద్వారా వ్యక్తి సునాయాసంగానే సిద్ధిని పొందుతాడు. (  9.27, 12.10 కూడా చూడండి) (18.46)   పరధర్మము చేయుటకంటే, సరిగ్గా చేయలేకపోయినా సరే, తన స్వధర్మము చేయుటయే మనిషికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధవిధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.  (3.35 కూడా చూడుము) (18.47) తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ అర్జునా! అగ్ని పొగచే కప్పివేయబడ్డట్లు, సమస్త కర్మ ప్రయాసలు, ఏదో ఒక దోషముచే ఆవరించబడి ఉంటాయి. (18.48) ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.  (18.49)

ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మాం ను కూడా ఎలా పొందగలడో- నేను క్లుప్తంగా వివరిస్తాను, విను.  (18.50) వ్యక్తి ఎప్పుడయితే, పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, మరియు ఇంద్రియములను చక్కగా నిగ్రహించి, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు మరియు వైరాగ్యమును సాధన చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్ధము, లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, పరబ్రహం తో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో తెలుసుకోవటం).18.51-53) పరబ్రహ్మాంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు సర్వభూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా వద్దకే చేరును.  (18.54) కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్ధముగా నేను ఎవరో తెలుసుకున్న తర్వాత, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. (5.19 కూడా చూడుము) (18.55)

నా భక్తులు సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు. (18.56) నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ది యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము. (18.57) నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు. (18.58)

కర్మ బంధం మరియు స్వేచ్ఛా సంకల్పం

ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ((నేను యుద్ధం చేయను’’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్ధమై పోతుంది. ఎందుకంటే, నీ స్వంత భౌతిక స్వభావమే నిన్ను యుద్ధము చేయడానికి పురికొల్పుతుంది. (18.59) ఓ అర్జునా, మోహప్రభావముచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజసిద్ధ స్వభావముచే జనించిన ప్రేరణ చే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు. (18.60) ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తితే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణంగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. (18.61) సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఆయన కృపచే, నీవు పరమశాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు. (18.62) ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాలకన్నా పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. (18.63)

లొంగిపోయే మార్గమే  భగవంతుని చేరడానికి అంతిమ మార్గం

నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమయినది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే  నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి. (18.64) ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించు. ఇలా చేయడం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ఇష్టమైనవాడివి, కావల్సినవాడివి. (18.65) అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తిడిని చేసెదను, భయపడకుము. (18.66)

అన్ని విధులను విడిచిపెట్టి, భగవంతుని ఆశ్రయించడం అంటే భగవంతునికి నైవేద్యంగా ఫలితాలకు, స్వార్థపూరిత అనుబంధం లేకుండా విధిని నిర్వహించాలి, మరియు సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం పూర్తిగా ఆయనపై మాత్రమే ఆధారపడి ఉండాలి. నిజమైన స్వీయ-లొంగిపోయే ఆత్మతో తనపై పూర్తిగా ఆధారపడే వ్యక్తికి భగవంతుడు పూర్తి బాధ్యత తీసుకుంటాడు.

భగవంతునికి అత్యున్నత సేవ, మరియు ఉత్తమ దాతృత్వం

ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నుడు కాని వానికి, భక్తి లేని వానికి చెప్పకూడదు. ఆధ్యాత్మిక విషయములు వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ప్రత్యేకంగా నాపట్ల అసూయ కలవారికి కూడా దీనిని చెప్పకూడదు. (18.67) ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు. (18.68) వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు. (18.69)

గీతా ప్రాముఖ్యత

 మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే నన్ను ఆరాధించినట్లు; అని నా అభిప్రాయము. (18.70) శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు. (18.71) ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా? (18.72) అర్జునుడు పలికెను: ఓ కృష్టా, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, అంతేకాకుండా నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు, నీ ఉపదేశం ప్రకారం చేస్తాను. (18.73) సంజయుడు పలికెను: ఈ విధంగా, నేను, వాసుదేవుని పుత్రుడు శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనది అంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.(18.74) వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను. (18.75) సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. (18.76) మరియు, శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడినై, పదేపదే మహదానందముతో పులకించి పోతున్నాను. (18.77)

జ్ఞానం మరియు కర్మ రెండూ అవసరం

ఎక్కడక్కడయితే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వవిజయము, సకల-సమృద్ధి మరియు ధర్మమూ ఉంటాయి అని నా నిశ్చిత అభిప్రాయము (18.78)

భగవద్గీత సమాప్తం

ఈ పుస్తకాన్ని శ్రీ కృష్ణుడికి అర్పించారు.

ఆయన మనందరినీ మంచితనం, శ్రేయస్సు

 మరియు శాంతితో ఆశీర్వదించు గాక!

ఓం తత్ సత్

Translated from English by: (AYYAGARI SURYA PRABHA)